Minister Satya Kumar Yadav: విభజన సమస్యలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నడుంబిగించారు.. అందులో భాగంగా.. ఈ రోజు హైదరాబాద్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశం కాబోతున్నారు.. ఈ సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. గతంలో కేసీఆర్, జగన్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిల్చి రాజకీయ లబ్ధి పొందాలని చూశారని ఆరోపించిన ఆయన.. రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలతోనే కేసీఆర్ అధికారంలోకి వచ్చారని విమర్శించారు.. అయితే, రెండు రాష్ట్రాల పరిష్కారం కోసం ఇద్దరు సీఎంలు భేటీ కావడం అభినంద నీయం.. విభజన చట్టంలో ఉన్న షెడ్యూల్ 9, 10 అంశాల మీద మంచి వాతావరణంలో చర్చలు జరుగుతాయి అని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: Group-2 Postponed: బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో గ్రూప్ 2 వాయిదా..?
ఇక, చంద్రబాబు లెటర్ రాయటం.. రేవంత్ రెడ్డి స్పందించటం బాగుంది అన్నారు మంత్రి సత్యకుమార్.. ఆస్తులు, నీటి పంపకాలు, ఉద్యోగుల పంపకాలపై స్నేహ పూర్వక చర్చ జరగనుంది.. రాజకీయాలకు అవకాశం లేకుండా చట్ట ప్రకారం ఉన్న అంశాలపై చర్చకు ముందుకు రావటం అభినందనీయం అన్నారు. మొదట ఐదేళ్ళపాటు కేంద్రంలో ఉన్న ఎన్డీయే ఏపీకి అండగా నిలిచింది.. కేసీఆర్, జగన్ ప్రభుత్వాల మధ్య సమస్యల పరిష్కారంపై స్పందన లేకపోవటంతో కేంద్రం ఏమీ చేయలేక పోయిందన్నారు. ప్రస్తుత సమావేశం ద్వారా ప్రధాన సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నాను అన్నారు. విభజన చట్ట ప్రకారం మాత్రమే ఆస్తులు, ఆదాయ, సహజ వనరుల పంపకాలు జరగాలి.. అంతేకాదు.. చట్టం దాటి పెట్టిన డిమాండ్స్ పై చర్చ జరపాలి అన్నారు. రాజకీయాలు పక్కన పెడితే ఏపీకి అన్యాయం జరిగింది అనేది వాస్తవం.. రాజధాని లేదు, ఏపీకి ఆదాయం లేదు, తెలంగాణకు మిగులు ఆదాయం ఉంది అన్నారు. మరోవైపు.. డిమాండ్స్ పెట్టడం సరికాదు, అత్యాసపరమైన డిమాండ్స్ మంచిదికాదు.. పరిణితి ఉన్న నాయకత్వం చర్చలు బాగానే జరుగుతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కేంద్రం మొదటి నుంచి అన్యాయం జరిగిన ఏపీకి అండగా ఉంది.. తర్వాత వైసీపీ అభివృద్ధి నిరోధక చర్యలతో కేంద్రం ఏమీ చేయలేక పోయిందన్నారు. సమావేశంతో రెండు రాష్ట్రాల సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నాను అన్నారు మంత్రి సత్య కుమార్ యాదవ్.