Site icon NTV Telugu

Malladi Vishnu: భగవద్గీతను కించపరిచిన వ్యక్తిని టీటీడీ సభ్యుడిగా ఎలా కొనసాగిస్తారు..

Malladi

Malladi

Malladi Vishnu: టీటీడీ పాలకమండలి సభ్యుడు, మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగవద్గీతను అవమానించేలా మాట్లాడారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. భారతదేశంతో పాటు ప్రపంచానికే ఆదర్శంగా ఉన్న భగవద్గీతను చులకనగా మాట్లాడారు.. భగవద్గీతను కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యేని టీటీడీ పాలకవర్గ సభ్యుడిగా ఎలా కొనసాగిస్తారు అని ప్రశ్నించారు. వ్యవస్థలను గౌరవించని వ్యక్తిని అసలు టీడీపీ పాలకవర్గ సభ్యుడిగా ఎలా అవకాశం ఇచ్చారని అడిగారు. తాను అనని మాటలు వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేశారని తిరిగి మాపై అభాండాలు వేస్తున్నారని మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు.

Read Also: Indian Railways: ఆంధ్రప్రదేశ్ లో మెగా టెర్మినల్స్.. రైల్వే శాఖ భారీ ప్లాన్

అయితే, ఎంఎస్ రాజు మాట్లాడిన మాటలు ప్రతీ ఒక్కరికి తెలుసని మాజీ ఎమ్మెల్యే విష్ణు తెలిపారు. అయినా ఎమ్మెల్యే రాజు మాపై నిందలు వేశారు.. మేం ప్రచారం చేసింది నిజమైతే తన వ్యాఖ్యలపై ఎందుకు క్షమాపణ చెప్పారు.. సనాతన ధర్మం గురించి పదే పదే మీ పార్టనర్ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడినా స్పందించరు.. గోషాలపై మాట్లాడిన మా పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై కేసులు పెట్టారని గుర్తు చేశారు. మరి టీటీడీ పాలకవర్గ సమావేశంలో గోషాల నిర్వహణ ప్రైవేట్ వాళ్లకు అప్పగించాలనే విషయంలో చర్చ ఎందుకు పెట్టారు.. ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం.. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన టీటీడీ బోర్డు సభ్యులే కించపరిచేలా వ్యవహరిస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుందని మల్లాది విష్ణు ప్రశ్నించారు.

Read Also: Upcoming 5G Smartphones: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా?.. నవంబర్‌లో లాంచ్ అయ్యే లిస్ట్ ఇదే!

తక్షణమే టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎంఎస్ రాజును తొలగించాలని వైసీపీ నేత మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా అనేక కార్యక్రమాలు చేశారు.. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అనేక చోట్ల జరుగుతున్నా బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని క్వశ్చన్ చేశారు. ఏం మాట్లాడినా తిరిగి వైసీపీ మీద నెపం వేస్తే సరిపోతుందని అనుకుంటే చూస్తూ ఊరుకోం అని మల్లాది విష్ణు హెచ్చరించారు.

Exit mobile version