Indrakeeladri Dispute: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పవర్ కట్ పంచాయతీ మళ్లీ ఉద్రిక్తమైంది. ఇంద్రకీలాద్రిపై పవర్ కట్ వివాదం ఇప్పటికే సీఎంఓ కార్యాలయం వరకు చేరుకుంది. దుర్గ గుడి ఈవో శీనా నాయక్‌పై దేవాదాయ కమిషనర్ రాంచంద్రమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటి వరకు విద్యుత్ అధికారులు vs ఆలయ అధికారులు మధ్య ఉన్న వివాదం, ఇప్పుడు ఈవో vs కమిషనర్ మధ్య పంచాయతీగా మారిపోయింది.
Read Also: Deepika Padukone : యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించిన దీపికా పదుకొణె..
అయితే, నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా కూడా ఈవో- దేవాదాయ కమిషనర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. సోషల్ మీడియా, మీడియా కథనాల ద్వారా మాత్రమే పరిస్థితి తెలుసుకోవాల్సి వస్తోంది అని ఈఓపై దేవాదాయ కమిషనర్ రాంచంద్రమోహన్ ఫైర్ అయ్యారు. సీఎంఓ కార్యాలయం నుంచి వివరణ అడుగుతున్నారని ఈవోకు కమిషనర్ తెలిపారు. వాళ్లకు నేను ఏం సమాధానం చెప్పాలంటూ ఈవోను దేవాదాయ కమిషనర్ ప్రశ్నించారు. ఇంద్రకీలాద్రిలో ఈ పవర్ వివాదం ఇంకా ఏ స్థాయికి చేరుతుందో ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది.