Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఊహించని ఝలక్.. మరో కేసులో పీటీ వారెంట్‌..

  • మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు ఊహించని ఝలక్‌..
  • వంశీపై పీటీ వారెంట్ దాఖలు చేసిన హనుమాన్ జంక్షన్ పోలీసులు..
  • బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో కేసు..
  • వల్లభనేని వంశీపై పీటీ వారెంట్ దాఖలు చేసిన పోలీసులు..
Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ్ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు ఊహించని ఝలక్‌ తగిలినట్టు అయ్యింది.. వల్లభనేని వంశీపై హనుమాన్ జంక్షన్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు.. వంశీపై మొత్తం ఆరు కేసులు నమోదు కాగా.. ఇప్పటికే ఐదు కేసుల్లో వంశీకి బెయిల్, ముందస్తు బెయిల్ మంజూరు అయ్యాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాత్రం.. వంశీ బెయిల్ పిటిషన్ పై రేపు తీర్పు వెల్లడించనుంది కోర్టు.. అయితే, ఈ సమయంలో బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో మాజీ ఎమ్మల్యే వల్లభనేని వంశీపై నమోదైన కేసులో ఇవాళ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై న్యాయమూర్తి ఇవాళ అనుమతి ఇస్తే.. వల్లభనేని వంశీకి రేపు బెయిల్ వచ్చినా.. జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉండదన్నమాట… ఇవాళ పీటీ వారెంట్ పై న్యాయమూర్తి ఆదేశాలు ఇస్తారా..? లేదా రేపటికి వాయిదా పడుతుందా అనేది ఈ రోజు తేలిపోనుంది..

Read Also: Vijay Devarakonda : విజయ్ దేవరకొండ సినిమాలో విలన్ గా సీనియర్ హీరో..?

మరోవైపు, రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ జైల్లో అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడంతో ఆయన ఇబ్బందులు పడ్డారు. ఇది గమనించిన పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆస్పత్రి వద్దకు వైసీపీ వర్గీయులు భారీగా చేరుకున్నారు. వల్లభనేని వంశీ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. అయితే, మల్లవల్లి భూముల్లో తమకు రావాల్సిన పరిహారం వల్లభనేని వంశీ తనకు అనుకూలంగా ఉన్న వారికి ఇప్పించారని వంశీపై కేసు నమోదు చేశారు హనుమాన్ జంక్షన్ పోలీసులు.. అయితే, ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు వల్లభనేని వంశీ.. దీనిపై విచారణ జరిపి ముందస్తు బెయిల్ ఇచ్చింది నూజివీడు కోర్టు. అయితే, వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్‌ వచ్చినా.. ఆయన జైలులోనే గడపాల్సిన పరిస్థితి.. మరికొన్ని కేసుల్లో వల్లభనేని వంశీ రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.. ఆత్కూరులో 8 ఎకరాలు కబ్జా చేశారని వంశీపై కేసు నమోదు చేశారు పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులోనూ ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు.