Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం.. జోగి బ్రదర్స్ కుమారులకు నోటీసులు..
- నకిలీ మద్యం తయారీ కేసులో కీలక పరిణామం..
- జోగి బ్రదర్స్ కుమారులు నలుగురికి ఎక్సైజ్ అధికారుల నోటీసులు..
- ఎల్లుండి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న అధికారులు..
- జోగి రమేష్ కుమారులు జోగి రాజీవ్, జోగి రోహిత్..
- జోగి రాము కుమారులు రాకేష్, రామ్మోహన్ లకు ఎక్సైజ్ అధికారుల నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Liquor Case: ఓ వైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసు సంచలనంగా మారిన వేళ.. మరోవైపు నకిలీ మద్యం వ్యవహారం కలకలం రేపింది.. అయితే, విజయవాడలో నకిలీ మద్యం తయారీ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే నకిలీ లిక్కర్ కేసులో మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రామును కూడా అరెస్ట్ చేశారు.. అయితే, తాజాగా, ఈ కేసులో జోగి బ్రదర్స్ కుమారులకు నోటీసులు అందజేశారు ఎక్సైజ్ పోలీసులు.. ఎక్సైజ్ శాఖ పంపిన నోటీసుల ప్రకారం విచారణకు హాజరుకావాల్సిన వారు.. జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్, జోగి రోహిత్.. జోగి రాము కుమారుడు రాకేష్, రామ్మోహన్ ఉన్నారు.. ఈ నలుగురు విజయవాడ ఎక్సైజ్ కార్యాలయంలో ఎల్లుండి ఉదయం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు..
Read Also: Hyderabad Metro : మెట్రోలో మహిళల భద్రతకు నూతన అడుగు
Also Read
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్‌షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
నకిలీ మద్యం తయారీ, నిల్వ, రవాణా మరియు పంపిణీ వ్యవహారంలో కీలక ఆధారాలు లభించడంతో విచారణను వేగవంతం చేసినట్టు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్టు కాగా.. అధికారులు కీలక అనుమానితుల ఆస్తి మరియు లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరిన్ని ప్రముఖులు కూడా దర్యాప్తులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.. మొత్తంగా ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము అరెస్ట్ కావడం.. ఇప్పుడు జోగి బ్రదర్స్ కుమారులు నలుగురికి నోటీసులు అందజేయడం చర్చగా మారింది.. కాగా, నకిలీ మద్యం తయారీ కేసులో అరెస్ట్ అయిన జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రామును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. నాలుగు రోజుల పాటు ప్రశ్నించిన విషయం విదితమే.. నాలుగు రోజుల్లో మొత్తం 250 ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తుంది.. అయితే, ప్రతి ప్రశ్నకూ దాటవేత ధోరణిలోనే సమాధానాలిచ్చారట…
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!