Bhavani Diksha Viramana: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు భవాని దీక్షా విరమణలు జరగనున్న నేపథ్యంలో దేవస్థానం, పోలీసులు, వివిధ శాఖలు భారీ ఏర్పాట్లు చేపట్టాయి. ప్రతి ఏటా భవానీల సంఖ్య పెరుగుతుండటంతో ఈసారి మరింత విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.. భవానీలు ఇరుముడులు సమర్పించేందుకు మొత్తం మూడు హోమగుండాలు ఏర్పాటు చేశారు. భవానీలు 41 రోజులపాటు అనుసరించిన నియమ నిష్టలకు ముగింపు పలకబోతుండటంతో వేలాదిగా భక్తులు తిరిగి ఇంద్రకీలాద్రి…