Vijayawada Metro Rail: విజయవాడ మెట్రో ప్రాజెక్టులో మరో కీలక అడుగు..
- విజయవాడ మెట్రో టెండర్లకు ఏపీఎంఆర్సీ సిద్ధం..
- ఈ నెల 14న టెండర్లకు ముహూర్తం ఖరారు..
- ఏలూరు, బందరు రోడ్ రెండు కారిడార్లకు కలిపి సింగిల్ టెండర్..
- రూ.4,500 కోట్ల వ్యయంతో టెండర్లు పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Metro Rail: విజయవాడ నగర అభివృద్ధిలో మరో కీలక అడుగు పడబోతోంది. విజయవాడ మెట్రో ప్రాజెక్ట్‌పై వేగం పెంచిన ఏపీఎంఆర్సీ.. ఈ నెల 14న టెండర్లకు ముహూర్తం ఖరారు చేసింది. ఏలూరు రోడ్, బందరు రోడ్ ఈ రెండు కారిడార్లకు కలిపి ఒకే సింగిల్ టెండర్ విధానం ద్వారా ప్రక్రియను చేపట్టనుంది. సుమారు రూ.4,500 కోట్ల వ్యయంతో టెండర్లను ఆహ్వానించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ప్రీ-బిడ్డింగ్ మీటింగ్‌లో 10కి పైగా బడా కంపెనీలు పాల్గొన్నాయి. జాయింట్ వెంచర్ విధానంలో పోటీకి రంగంలోకి దిగేందుకు పలువురు నిర్మాణ దిగ్గజాలు ఆసక్తి చూపుతున్నాయి. ముందుగా టెక్నికల్ బిడ్లు, ఆ తర్వాత ఫైనాన్షియల్ బిడ్లు తెరవనున్నట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన సంస్థలకు టోపోగ్రఫీ, జియోగ్రాఫికల్ సర్వేలు .. సాయిల్ టెస్టులు నిర్వహించనున్నారు.. ఈ సర్వేలకు నాలుగు నుంచి ఐదు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కేంద్ర అనుమతులు లభించగానే క్షేత్ర స్థాయిలో మెట్రో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఏలూరు రోడ్‌పై డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రతిపాదనను కూడా ఏపీఎంఆర్సీ సిద్ధం చేసింది. డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్ర ఉపరితల రవాణా శాఖకు పంపించింది. అనుమతులు లభిస్తే, విజయవాడ మెట్రో పనులు ఇక ఎలాంటి అడ్డంకులు లేకుండా దూసుకెళ్లే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Read Also: Boy dies with Hot Tea: వేడి వేడి టీ తాగి బాలుడు మృతి
Also Read
- Perni Nani: డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం.. బహిరంగ చర్చకు రావాలన్న పేర్ని నాని
- Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
- Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసు కొత్త మలుపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్‌షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరే.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!