Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Police Search At Vallabhaneni Vamsis House In Hyderabad Have Concluded

Police search at Vallabhaneni Vamsi house: వల్లభనేని వంశీ మొబైల్‌ ఎక్కడ..? నిరాశగా వెనుదిరిగిన పోలీసులు

Published Date :February 15, 2025 , 5:00 pm
By Sudhakar Ravula
  • వల్లభనేని వంశీ ఇంట్లో ముగిసిన పోలీసుల సోదాలు..
  • మొబైల్ ఫోన్ కోసం విస్తృతంగా తనిఖీలు..
  • పోలీసులకు దొరకని వల్లభనేని వంశీ ఫోన్..
Police search at Vallabhaneni Vamsi house: వల్లభనేని వంశీ మొబైల్‌ ఎక్కడ..? నిరాశగా వెనుదిరిగిన పోలీసులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Police search at Vallabhaneni Vamsi house: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. వంశీ మొబైల్‌లో కీలక ఆధారాలు లభ్యమవుతాయని భావిస్తున్న ఏపీ పోలీసులకు ఓ రకంగా షాక్‌ తగిలినట్టు అయ్యింది.. హైదరాబాద్‌లోని వల్లభనేని వంశీ మోహన్‌ ఇంట్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు విజయవాడలోని పటమట పోలీసుల సోదాలు.. దాదాపు రెండు గంటలపాటు వంశీ ఇంట్లో సోదాలు చేశారు పటమట పోలీసులు.. వంశీ ఫోన్ కోసం ఆయన ఇంట్లో విస్తృతంగా గాలించారు.. అయితే, వంశీ ఇంట్లో ఫోన్ లభించకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు.. కాగా, చివరగా వంశీ ఇంట్లోనే సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్‌ చూపించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.. కానీ, అయినా.. ఆయన ఇంట్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించినా వల్లభనేని వంశీ మొబైల్‌ ఫోన్‌ లభించలేదు..

Read Also: Hyderabad: ప్రియురాలి పేరెంట్స్ వేధింపులకు ప్రియుడు బలి..

కాగా, గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంట్లో రెండో రోజు కూడా పడమట పోలీసులు సోదాలు నిర్వహించి.. నిరాశతో వెనుదిరిగారు.. హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసుల సహాయంతో వంశీ ఇంట్లో తనిఖీలు చేపట్టారు.. మొదటి రోజు సోదాల్లో కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, సీసీ కెమెరా ఫూటేజీని సేకరించారు. వల్లభనేని వంశీ ఇంటికి సంబంధించి గత వారం రోజుల సీసీ టీవీ విజువల్స్ ను ఏపీ పోలీసులు సేకరించారు. ఇక, ఈ రోజు వల్లభనేని వంశీ సెల్‌ఫోన్ కోసం గాలించారు పడమట పీఎస్ పోలీసులు.. అయితే, హైదరాబాద్ లోని వల్లభనేని వంశీ ఇంట్లో సెల్‌ఫోన్ లభించకపోవడంతో పడమట పోలీసులు తిరిగి వెళ్లిపోయారు.. కానీ, వంశీ సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా ఫోన్ కోసం వంశీ ఇంటిని జల్లెడ పట్టారు. చివరి లొకేషన్ భూజా లొకేషన్ చూపించడంతో ఇంట్లో సోదాలు చేశారు. కాగా, మొన్న హైదరాబాద్ లో వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలించిన విషయం విదితమే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap police
  • hyderabad
  • Vallabhaneni Vamsi Cell Phone
  • Vallabhaneni Vamsi's house

తాజావార్తలు

  • Harish Rao : గిరిజనుల ఏ ఒక్క హామీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు

  • Oracle Layoffs 2026: ఎలాంటి హెచ్చరికలు లేకుండా 30 వేల మంది తొలగింపు.. కన్నీటి పర్యంతమైన ఉద్యోగులు..

  • Oracle Layoffs: 12 ఏళ్ల సర్వీస్ ఉన్నా కనికరం చూపని కంపెనీ.. హైదరాబాద్, పూణె ఐటీ ఉద్యోగుల కన్నీళ్లు!

  • Bank Jobs: పంజాబ్ & సింధ్ బ్యాంక్‌లో 1000 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు.. గ్రాడ్యుయేట్స్‌కు బంపర్ అవకాశం

  • Iran War: భారత్‌కు వస్తున్న ఇరాన్ చమురు నౌక చైనాకు మళ్లింపు.. కారణం ఏమిటి..?

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions