AP High Court: అధికారులపై హైకోర్టు ఆగ్రహం.. ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుందా..?
- విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం..
- మాంసం, చేపల దుకాణాలకు కూడా ఈ వేలంపై విచారణ..
- అధికారులు ఏసీ రూముల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటున్నారు..
- క్షేత్రస్థాయి పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ హైకోర్టు ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: అధికారుల తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మాంసం, చేపల దుకాణాల కేటాయింపుకు చేపట్టిన ఈ-వేలం విధానంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా అధికారులు ఏసీ రూముల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటున్నారని, క్షేత్రస్థాయి వాస్తవాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని కోర్టు తీవ్రంగా మండిపడింది. చిరు వ్యాపారులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతవరకు ఉంటుందని హైకోర్టు ప్రశ్నించింది. ఏ డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి, ఎలా చేయాలి అన్న అవగాహన వారికి ఎలా ఉంటుందంటూ వ్యాఖ్యానించింది. చాలామంది చిరు వ్యాపారులు చదువు రాని వారే ఉంటారని, అలాంటి వారు ఈ-వేలంలో ఎలా పాల్గొంటారని కోర్టు ప్రశ్నలు సంధించింది.
Read Also: AP Liquor Scam Case: చెవిరెడ్డికి స్వల్ప ఊరట.. ఏసీబీ కోర్టు అనుమతి
Also Read
- Perni Nani: డీఎస్సీ నియామకాలపై కొత్త వివాదం.. బహిరంగ చర్చకు రావాలన్న పేర్ని నాని
- Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
- Sai Krishna Custodial Death Case: సాయి కృష్ణ కేసు కొత్త మలుపు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్‌షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
సాంప్రదాయ బహిరంగ వేలం విధానమే చిరు వ్యాపారులకు అనుకూలమని హైకోర్టు స్పష్టం చేసింది. ఏసీ రూముల్లో కూర్చుని తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రజల సమస్యలను గమనించకుండా యాంత్రికంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో దుకాణాల కేటాయింపుకు సంబంధించి జారీ చేసిన ఈ-వేలం నోటిఫికేషన్ అమలును హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్‌తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!