AP Liquor Scam Case: ఏసీబీ కోర్టులో కీలక వాదనలు.. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి రిమాండ్ విధింపు
- మద్యం కుంభకోణంలో కేసులో కీలక పరిణామం..
- ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి రిమాండ్ విధింపు..
- సుమారు మూడు గంటల పాటు కోర్టులో కొనసాగిన వాదనలు..
- ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో రిటైర్ట్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ వోఎస్డీ కృష్ణమోహన్ రెడ్డికి రిమాండ్ విధించింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. మద్యం కుంభకోణంలో కేసులో A 31 ధనుంజయ రెడ్డి, A 32 కృష్ణమోహన్ రెడ్డిని శుక్రవారం రోజు అరెస్ట్ చేసిన విషయం విదితమే కాగా.. ఈ రోజు ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు సిట్ అధికారులు.. సుమారు మూడు గంటల పాటు ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు కొనసాగాయి.. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. మద్యం కుంభకోణం కేసులో నిందితులందరితో కలిపి వచ్చేలా రిమాండ్ విధించారు.. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి మూడు రోజులు పాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం.. అంటే.. ఇద్దరికీ ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.. దీంతో.. ఇద్దరు నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు పోలీసులు.. అయితే, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వయస్సు రీత్యా.. జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశించిందిన.. వెస్ట్రన్ కమోర్డ్, మంచం, దిండు, దుప్పటి, డ్రై ఫ్రూట్స్‌కు అనుమతి ఇచ్చింది.. ధనుంజయరెడ్డికి కావాల్సిన ఇన్సులిన్ ఇంజక్షన్లు స్టోర్ చేసుకునేందుకు ఫ్రిజ్ సదుపాయం కల్పించాలని స్పష్టం చేసింది ఏసీబీ కోర్టు..
Read Also: Heart attack : పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ.. కుప్పకూలి వ్యక్తి మృతి..
Also Read
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్‌షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!