Vijayawada Crime: ఘోరం.. గంజాయి మత్తులో మైనర్ బాలికని నరికి చంపిన రౌడీ షీటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Rowdy Sheeter Killed A Minor Girl Rani: విజయవాడలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. గంజాయి మత్తులో కుక్కల రాజు అనే రౌడీ షీటర్ ఓ మైనర్ బాలికని నరికి చంపాడు. సీఎం నివాసానికి కూతవేటు దూరంలోనే ఘోరం జరిగింది. కంటిచూపు లేని రాణి అనే మైనర్‌ను రాజు అత్యంత కిరాతకంగా చంపాడు. మైనర్ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో, అతడు ఈ కిరాతక పనికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లి మనోహరం వెంటనే ఇంటికి చేరుకొని, విగతజీవిగా పడి ఉన్న కుమార్తెను చూసిన బోరున విలపించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రౌడిషీటర్ రాజుపై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఆ బాలిక మృతదేహాన్ని తరలించారు. బాలికను హత్య చేసిన అనంతరం కుక్కల రాజు పరారీయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Tech Layoffs to Continue: మరికొన్నాళ్లపాటు కొనసాగనున్న టెక్ లేఆఫ్‌లు
Also Read
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
- OTR: టీడీపీ ఎమ్మెల్యేలకు మరో దఫా కౌన్సెలింగ్..?
ఈ ఘటనపై మృతురాలి తల్లి మనోహరం మాట్లాడుతూ.. ‘‘నా బిడ్డను అన్యాయంగా చంపేశాడు. కళ్లు కనిపించవనే కనికరం కూడా లేదు. నిన్న రాజు గంజాయి సేవించే వచ్చాడు. నేను అసభ్యంగా ప్రవర్తించటం లేదని చెప్పి వెళ్లిపోయాడు. అరగంటలో వెనక్కి వచ్చి చూసేసరికి గొడ్డలితో నా కూతురిని నరికి చంపాడు. నా పిల్ల అబద్దాలు చెప్పదు.. వాడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆడుకుంటున్న పిల్లను అన్యాయంగా నరికేశాడు. గతంలో కూడా కుక్కల రాజు కొందరిపై కత్తితో దాడి చేశాడు. గంజాయి ముఠా ఆగడాలతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఇళ్ల మీదకు వెళ్లి రాజు అల్లరి చేస్తున్నాడు. నాకు న్యాయం చేయాలి.. వాడిని కఠినంగా శిక్షించాలి’’ అంటూ రోదించింది. తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆ మైనర్ తన తల్లికి చెప్పడం వల్లే.. కుక్కల రాజు ఆగ్రహంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు.
Pini Village: ఆ గ్రామంలో మహిళలు దుస్తులు వేసుకోరు.. ఎందుకో తెలుసా?
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!