చదువుకోవడం లేదని తల్లి మందలించిందని.. ఓ బాలుడు ఏకంగా కన్న తల్లిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. విజయవాడ సత్యనా రాయణపురం గులాబీతోట ప్రాంతా నికి చెందిన మహిళకు ఇద్దరు కుమారులు. భర్తతో విభేదాల రావడంతో ప్రస్తుతం ఆమె ఇద్దరు కుమారులతో ఒంటరిగా జీవిస్తుంది. పెద్ద కుమారుడిని ఒక దుకాణంలో పనిలోకి పంపు తున్నారు. ఆమె కూడా ఒక దుకా ణంలో పని చేస్తూ వచ్చిన డబ్బులతో చిన్న కుమారుడిని చదివిస్తోంది.
ఇంత వరకు బాగానే ఉన్న.. అసలు చిక్కల్లా ఇక్కడే వచ్చింది. బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు. చిన్న కుమారుడికి తల్లి మొబైల్ ఫోన్ కొనిచ్చింది. ఎప్పుడు ఫోన్ లో ఆడుకోవడం చూసి తల్లి.. సరిగా చదువు కోవడం లేదని మందలించింది. దీంతో ఆ బాలుడు తల్లిపై కోపంతో ఇల్లు వదిలి విజయవాడలోని వన్ టౌన్ కు చేరుకున్నాడు. అక్కడ ఉన్న ఏసీపీ దుర్గారావుకు తల్లిపై ఫిర్యాదు చేశాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న ఏసీపీ బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి చదువు లేకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులు వివరిం చారు. తల్లి కష్ట పడుతూ కుటుంబ భారం మోస్తున్న సమయంలో కుమారులు అండగా నిలవాలని వివరించడంతో చిన్నారి మనసు మార్చుకున్నాడు.