అభ్యర్థులు దొరకని స్థితి నీది…నవ్వులుపాలు కావొద్దు చంద్రబాబు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకని స్థితి టిడిపిది అని.. బక్వాస్ మాటలతో నవ్వులపాలు కావొద్దు అని చంద్రబాబుకు చురకలు అంటించారు. “ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే తన పార్టీ గెలుస్తుందట. సంక్షేమం అమలులో విఫలమైనందువల్ల ప్రజలు జగన్ గారిని వ్యతిరేకిస్తున్నారట! ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకని స్థితి నీది. డిపాజిట్ దక్కితే చాలనుకున్న సంగతి ప్రజలింకా మర్చిపోలేదు. బక్వాస్ మాటలతో నవ్వులుపాలు కావొద్దు చంద్రం. స్వీయ ఆరాధన ఏ స్థాయికి చేరిందంటే 5 కోట్ల మంది ప్రజలు తనను తిరస్కరించి సరిదిద్దుకోలేని తప్పు చేశారని భ్రమపడుతున్నాడు. వాళ్లకు ఇంత చైతన్యం ఎలా వచ్చిందని విస్మయం చెందుతున్నాడు బాబు. రెండేళ్ల తర్వాత కూడా అలాగే ఆలోచిస్తున్నాడంటే మెంటల్ కండిషన్ అనుమానించాల్సిందే.” అంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. ఇక అంతకు ముందు ట్వీట్ లో “సుస్థిర ఆర్థికాభివృద్ధిలో 2020-21 ఏడాదికిగానూ రాష్ట్రాల వారీగా నీతి ఆయోగ్ ర్యాంక్‌లు విడుదల చేసింది. పలు అంశాల్లో మెరుగైన పనితీరు కనబరిచిన ఏపీ.. టాప్-5 రాష్ట్రాల జాబితాలో నిలిచింది. 72 పాయింట్లతో మూడోస్థానం దక్కించుకుంది. క్లీన్ ఎనర్జీ విభాగంలో టాప్ ర్యాంక్ సాధించింది.” అని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే తన పార్టీ గెలుస్తుందట. సంక్షేమం అమలులో విఫలమైనందువల్ల ప్రజలు జగన్ గారిని వ్యతిరేకిస్తున్నారట! ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకని స్థితి నీది. డిపాజిట్ దక్కితే చాలనుకున్న సంగతి ప్రజలింకా మర్చిపోలేదు. బక్వాస్ మాటలతో నవ్వులుపాలు కావొద్దు చంద్రం.
Also Read
- OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
- Job Fraud: నిరుద్యోగులు కదా ప్రభుత్వ ఉద్యోగం అంటే నమ్మేశారు.. ఒకొక్కరి నుంచి రూ.15 లక్షల చొప్పున వసూలు చేసి..
- AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. వారికి రూ. లక్షన్నర వరకు రుణమాఫీ.. కీలక నిర్ణయాలివే..
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్‌ను హీరో చేశారు..
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 4, 2021
- Tags
- ap
- chandrababu
- tdp
- vijayasaireddy
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!