Fire Accident: విశాఖ HPCL రిఫైనరీలో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి ఆకాశంలోకి ఎగిసిపడిన దట్టమైన పొగ, మంటలు స్థానిక నివాసితులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి.
రిఫైనరీలోని సల్ఫర్ పిచ్ ట్యాంక్‌లో ఈ మంటలు ప్రారంభమైనట్లు సమాచారం. ఈ ఘటనపై విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ స్పందిస్తూ.. మంటలు కేవలం ఆ ఒక్క ట్యాంక్కే పరిమితమయ్యాయని, రిఫైనరీలోని ఇతర విభాగాలకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను వేగంగా అదుపులోకి తీసుకొచ్చారు.
Also Read
- Bhuvneshwar Kumar: భువీ చాప్టర్ క్లోజ్.. మహమ్మద్ షమీ రీ-ఎంట్రీ..? ఇవిగో ప్రూఫ్స్..
- Afghanistan: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన జట్టు..
- Harsh Dubey: 59 ఏళ్ల రికార్డు బ్రేక్.. సంచలనం స్పష్టించిన భారత స్పిన్నర్..
- AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. గెలిచేదెవరో?
Fire Incident at HPCL Visakhapatnam Refinery
A fire incident was reported at the pitch intermediate storage tank at Visakh Refinery of Hindustan Petroleum Corporation Limited (HPCL), at around 10 PM on November 2, 2026.
Fire & Safety Team of Visakh Refinery promptly activated the firefighting and emergency response measures.
The fire was localized to pitch tank area and was brought under control within a short time. There has been no casualties.
All the Units of the Refinery are working safely.
HPCL remains committed to the highest standards of safety and emergency preparedness.
@HardeepSPuri @TheSureshGopi @PetroleumMin @Secretary_MoPNG— Hindustan Petroleum Corporation Limited (@HPCL) November 2, 2026
ఈ అగ్నిప్రమాదంపై హెచ్‌పిసిఎల్ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఫైర్ ఫైటర్లు సకాలంలో స్పందించి ప్రమాదాన్ని పూర్తిగా నియంత్రించారని తెలిపింది. ఈ దుర్ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించింది. రిఫైనరీలోని మిగిలిన అన్ని యూనిట్లు సురక్షితంగా పనిచేస్తున్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. గెలిచేదెవరో?
-
Fire Accident: విశాఖ HPCL రిఫైనరీలో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు..
-
Breast Cancer: 17ఏళ్లకే బ్రెస్ట్ క్యాన్సర్.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి!
-
Monkey Branching: డేటింగ్లో కొత్త ట్రెండ్.. మంకీ బ్రాంచింగ్ అంటే ఏంటి?
-
Lancet Report: 22 లక్షల మరణాలకు కారణం ఇదే! లాన్సెట్ నివేదిక బయటపెట్టిన నిజం
-
Bhuvneshwar Kumar: భువీ చాప్టర్ క్లోజ్.. మహమ్మద్ షమీ రీ-ఎంట్రీ..? ఇవిగో ప్రూఫ్స్..
ట్రెండింగ్
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!