Vijayasai Reddy Tele Conference Meeting With YCP Leaders: సంస్థాగత నిర్మాణంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, సమన్వయంతో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలో వైసీపీ కేంద్రం కార్యాలయం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో ఆయన సోమవారం సోమవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పార్టీ అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటు, త్వరలో ప్రభుత్వం నిర్వహించనున్న జగనన్న సురక్ష కార్యక్రమంపై మాట్లాడారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఆలసత్వం వహించరాదని సీఎం జగన్ హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేశారు.
Mumbai: కదులుతున్న ఆటోలో ప్రియురాలి గొంతు కోసి పారిపోయిన ప్రియుడు
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాష్ట్రస్థాయి నుండి మండల స్థాయి వరకు పార్టీ అనుబంధ విభాగ కమిటీల నియామకాలను 15 రోజులలోపు పూర్తి చేయాలని విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ కమిటీల ప్రతిపాదనలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించడంలో జాప్యం జరుగుతోందని.. జిల్లా పార్టీ అధ్యక్షుల పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు రీజనల్ కోఆర్డినేటర్లతో సమన్వయం చేసుకొని, ప్రతిపాదనలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించాలని సూచించారు. గత రెండు వారాలుగా పార్టీ కేంద్ర కార్యాలయంలో.. మొత్తం 17 పార్టీ విభాగాలకు సంబంధించిన రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇన్చార్జులు, జిల్లా అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించారని అన్నారు. ఈ సమావేశాలలో విభాగాల తదుపరి కార్యాచరణ కమిటీల నియామకాలపై సమీక్షించడం జరిగిందని చెప్పారు. ఈ క్రమంలో జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల నుంచి సహకారం అందినప్పుడే పార్టీ అనుబంధ విభాగాల కమిటీలను ప్రతిపాదించగలమని ఎక్కువ శాతం మంది జోనల్ ఇంచార్జీలు, విభాగ జిల్లా అధ్యక్షులు తమకు తెలియజేశారని అన్నారు. సమన్వయం చేసుకొని, పార్టీ అనుబంధ కమిటీలను త్వరగా పూర్తి చేయాలన్నారు.
Kakani Govardhan Reddy: 2024 ఎన్నికల్లో మూకుమ్మడిగా పోటీ చేసినా.. వైసీపీకి పోయిందేమీ లేదు
పార్టీ పదవుల్లో ఉన్న వారందరికీ పార్టీ ఐడి కార్డులను జారీ చేయడం జరుగుతుందని విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్ర పార్టీ కమిటీ నిర్మాణ క్రమం ఏ విధంగా ఉండాలన్న దానిపై పార్టీ ప్లాన్ చేసిన తర్వాత, పార్టీ అధ్యక్షులు ఆమోదం పొందిన తర్వాత తెలియజేయడం జరుగుతుందన్నారు. అలాగే.. అధ్యక్షుల ఆమోదం లేకుండా వేసిన కమిటిలకు ఎటువంటి ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు. ఏ స్థాయి పార్టీ అనుబంధ కమిటీలైనా.. పార్టీ అధ్యక్షులైన సీఎం జగన్ ఆమోదం పొందిన తర్వాత కేంద్ర పార్టీ కార్యాలయం ప్రకటిస్తుందని వివరించారు. గతంలో బీసీ మహాసభ నిర్వహించిన తరహాలోని ఎస్సీ, ఎస్టీ, ముస్లీం-మైనారిటీ మహాసభలు నిర్వహిస్తామని చెప్పారు. త్వరలో ముస్లిం మైనారిటీ మహాసభ కర్నూలులో జూలై 15న ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నామని అన్నారు. బీసీ మహాసభ ఎలా అయితే విజయవంతమైందో.. అలాగే మిగిలిన అనుబంధ విభాగాల మహాసభలను కూడా విజయవంతం చేయాలని కోరారు.
ఇదే సమయంలో.. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సేవలను అందించి, వారిలో చిరునవ్వే లక్ష్యంగా సీఎం జగన్ జగనన్న సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని విజయసాయిరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా.. ప్రతి సచివాలయంలో మండల స్థాయి అధికారులు ఒక రోజు గడుపుతారని తెలిపారు. క్యాంపు నిర్వహించిన రోజున ప్రజలు తమ పరిధిలో ఉన్న సచివాలయాన్ని సందర్శించి, సర్టిఫికెట్లతో పాటు ఇతర సమస్యలు పరిష్కారాన్ని ఉచితంగా పొందవచ్చని చెప్పారు. ప్రజలు ఇంటి వద్దకే సేవలను తీసుకురావడానికి, అడ్డంకులు, అవరోధాలు తొలగించడానికి జగనన్న సురక్ష శిబిరాలను జూన్ 23 నుంచి ఒక నెల రోజులపాటు నిర్వహించబడతాయని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు లబ్ధి పొందేలా చూడాలని, ప్రభుత్వ పత్రాలకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చూపి వారికి లబ్ధి చేకూర్చాలని సూచించారు. అలాగే.. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి తెలియజేయాలన్నారు. పాలనలో పారదర్శకతను మెరుగుపరచడం, నమ్మకాన్ని పెంపొందించడం, పాలనాపరమైన విషయాల్లో ప్రజలకు సకాలంలో సహాయం అందించడం.. వంటి అంశాలను ఈ కార్యక్రమంలో లక్ష్యాలుగా ప్రభుత్వం పెట్టుకుందని విజయసాయిరెడ్డి వివరించారు.