Vijayasai Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు సుమారు7 గంటల పాటు విచారణ చేశారు. విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ED అధికారులు అడిగిన ప్రశ్నల్లో కొన్ని రికార్డ్ చేశారు.. కొన్ని రికార్డ్ చేయకుండా వదిలేశారు.. లిక్కర్ స్కాం జరిగిందా లేదా… అని మొదటి ప్రశ్న సంధించారు.. లిక్కర్ స్కాం గురించి నాకు తెలియదు.. లిక్కర్ అనే విషయంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో.. వాళ్ళనే అడగాలి అని చెప్పాను.. నెంబర్ 2 స్థానంలో ఉండి.. మీకు తెలియదా అని ప్రశ్నించారు.. వైసీపీ పార్టీలో నెంబర్ 2 స్థానం అనేదే ఉండదని చెప్పాను.. ప్రాంతీయ పార్టీలో నెంబర్ 2 అనేది ఉండదు అని చెప్పాను.. కేసులు చుట్టు ముట్టిన తర్వాతే.. నన్ను నెంబర్ 2 అని ప్రచారం చేశారు.. కేసులు ఉన్నప్పుడే నన్ను నెంబర్ 2 అంటారు.. ఏవైనా లాభాలు వస్తే.. నేను నెంబర్ 100లో కూడా ఉండనని విజయసాయి రెడ్డి వెల్లడించారు.
Read Also: Terror Threatsషాకింగ్.. రిపబ్లిక్ డే రోజు భారత్‌పై భారీ ఉగ్రదాడికి ప్లాన్! కట్‌చేస్తే..
ఇక, అధికారం రాక ముందు వరకు జగన్మోహన్ రెడ్డి నాకు నెంబర్ 2 స్థానమే ఇచ్చారని విజయసాయి రెడ్డి తెలిపారు. గుండెల్లో పెట్టుకుని చూశారు.. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఏర్పాడి.. నాపై లేనిపోనివి చెప్పారు.. నేను నమ్ముతున్న వేంకటేశ్వర స్వామి మీద ఒట్టు వేసి చెప్తున్నా.. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచే నన్ను పక్కన పెట్టారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి కి లిక్కర్ స్కాం గురించి తెలియదు.. తెలిసి ఉంటే.. ఆయన ఊరుకోరు అని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని నేను ED అధికారులకు చెప్పాను.. ఈ సమాధానం రికార్డ్ చేయలేదు, లిక్కర్ స్కాం బయటకు రావడం వల్లే.. నువ్వు పార్టీ నుంచి బయటకు వచ్చావా అని ప్రశ్నించారు.. జగన్ నన్ను దూరం పెట్టడాన్ని తట్టుకోలేక.. అవమానం, మనస్థాపంతోనే పార్టీ నుంచి బయటకు వచ్చాను అని చెప్పగా.. ఈ విషయం రికార్డ్ చేశారని విజయసాయి రెడ్డి అన్నారు.
Read Also: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమా స్టార్ట్ అయ్యేది అప్పుడే!
అయితే, నా ఆస్తుల వివరాలు అన్నీ ED అధికారులకు ఇచ్చాను అని మాజీ ఎంపీ సాయిరెడ్డి పేర్కొన్నారు. ఇవి కాకుండా నాకు ఏవైనా ఆస్తులు ఉంటే.. ఎలాంటి చర్యలకు ఐనా సిద్ధమని చెప్పాను.. నాకు అక్రమ ఆస్తులు ఉన్నాయి అని వస్తున్న ఆరోపణలు అన్నీ చంద్రబాబు చేస్తున్నవే.. నాకు అక్రమ ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే.. నేను రాజకీయాల నుంచే తప్పుకుంటానని తెలిపా.. నేను ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల నుంచి తప్పుకోను.. భవిష్యత్ ప్రణాళిక ఏంటో త్వరలో మీడియా ముందు ప్రకటిస్తాను.. తిరిగి రాజకీయ ప్రవేశం చేస్తానని విజయసాయి చెప్పుకొచ్చారు.
Read Also: Amazon Sale: రోబోట్ వాక్యూమ్ క్లీనర్లపై బెస్ట్ డీల్స్.. రూ.60 వేలకుపైగా తగ్గింపు!
కాగా, చంద్రబాబు ప్రభుత్వం.. కక్ష పూరిత చర్యలకు పాల్పడుతోంది అని విజయసాయి రెడ్డి ఆరోపించారు. సాయిరెడ్డి అనే వ్యక్తి.. వెనక్కి తగ్గే వాడిని కాను.. అధికారం శాశ్వతం కాదు.. జగన్ అధికారంలోకి రాగానే.. 25 ఏళ్ల పాటు అధికారంలో ఉంటా అనుకున్నాడు.. చంద్రబాబు, లోకేష్ కూడా ఇప్పుడు మరో 25 ఏళ్ళు మేమే ఉంటామని అనుకుంటున్నారు.. జగన్ చుట్టూ.. కోటరీ ఉన్నంత వరకు అధికారంలోకి రాడు అని జోస్యం చెప్పాడు. కూటమిని విడగొట్టాలి.. అప్పుడే జగన్ కి అధికారం సాధ్యం.. నేనేదో కొత్త పార్టీ పెట్టి.. చంద్రబాబు ఆర్థిక సహాయం తీసుకుంటూ.. పని చేస్తున్నా అని కొందరు జర్నలిస్టులు అంటున్నారు.. అలా కామెంట్ చేస్తున్న వాళ్ళు.. వైసీపీ పేటీఎం బ్యాచ్ అని సాయి రెడ్డి మండిపడ్డారు.
