తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఇక భారత్ రాష్ట్ర సమితిగా మారిన సంగతి తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ని జాతీయ పార్టీగా ప్రకటించారు. జాతీయ పార్టీగా టీఆర్ఎస్ ను భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానాన్ని చదివి వినిపించారు పార్టీ అధ్యక్షులు కె.చంద్రశేఖర రావు. ఈ మార్పు పట్ల రాజకీయంగా ప్రతిస్పందనలు వినిపిస్తున్నాయి. బీ.ఆర్.ఎస్.ఏర్పాటు వల్ల ఆంధ్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పు ఉండదన్నారు వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఇక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ కు అవకాశమే లేదు. సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి దార్శనికత వల్ల వచ్చే 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డే సీఎం అన్నారు ఎమ్మెల్మే గణేష్.
Read Also: Toll Gates: టోల్ వసూళ్లపై కేంద్రం కొత్త రూల్స్
రాష్ట్ర విభజన వల్ల ఆంధ్ర ప్రదేశ్ చాలా నష్టపోయింది…అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే ఉండిపోవడం వల్ల చాలా జిల్లాలు వెనుకబాటుతనానికి గురయ్యాయి. ఇప్పుడు టీ.ఆర్.ఎస్. ఎన్ని పేర్లు మార్చు కుని వచ్చినా ఆంధ్రా ప్రజలు విశ్వసించరని తన అభిప్రాయం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. ఇదిలా వుంటే.. మంత్రి జోగి రమేష్ బీఆర్ఎస్ పై చురకలు అంటించారు. బీఆర్‌ఎస్ కాదు.. ఏ పార్టీ వచ్చినా వైసీపీని ఏమీ చేయలేదన్నారు. వైసీపీ పార్టీ ఎవరికీ భయపడదని చెప్పారు. ఏపీ ప్రజలంతా తమవైపే ఉన్నారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టినన్ని సంక్షేమ కార్యక్రమాలు మరే రాష్ట్రంలోనూ అమలు కావడంలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుస్తుందని మంత్రి జోగి రమేష్ జోస్యం చెప్పారు.
