Vande Bharat Sleeper : ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్.. 16 గంటల్లోనే ముంబై..
- బెంగళూరు–ముంబై మధ్య కొత్త వందే భారత్ స్లీపర్ రైలు
- అనంతపురం, గుంతకల్లులో రైలు హాల్ట్
- 16 గంటల్లోనే ముంబై నుంచి బెంగళూరుకు ప్రయాణం
- 823 బెర్త్‌లు.. మూడు తరగతుల్లో టికెట్ ధరల వివరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వే ప్రయాణికులకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతీయ రైల్వే శాఖ అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ మార్గాల్లో వందే భారత్ చైర్ కార్ సర్వీసులు అందుబాటులో ఉండగా, ఇప్పుడు సరికొత్త హంగులతో దేశంలోనే మూడోదిగా నిలిచిన వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బెంగళూరులో ఈ అత్యాధునిక రైలును అధికారికంగా ప్రారంభించారు. బెంగళూరు నుంచి ముంబై మధ్య రాకపోకలు సాగించనున్న ఈ రైలు మార్గమధ్యలో ఏపీలోని అనంతపురం, గుంతకల్లు స్టేషన్లలో ఆగుతుండటం విశేషం.
16 గంటల్లోనే ముంబై టూ బెంగళూరు జర్నీ.. టైమ్ షెడ్యూల్ ఇదే
సాధారణ రైళ్లలో ముంబై నుంచి బెంగళూరు చేరుకోవడానికి దాదాపు 22 గంటల సమయం పడుతుండగా, ఈ వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ద్వారా కేవలం 16 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. కర్ణాటక, మహారాష్ట్రలను అనుసంధానించే ఈ రైలు మార్గమధ్యలో అనంతపురం, గుంతకల్, రాయచూర్, యాద్గిర్, కలబురిగి, సోలాపూర్, పూణే, కళ్యాణ్ సహా మొత్తం 8 స్టేషన్లలో ఆగనుంది. ముంబై-బెంగళూరు (27651) రైలు ముంబైలో రాత్రి 10.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు గుంతకల్లుకు, 8.38 గంటలకు అనంతపురంకు చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ రైలు మంగళవారం మినహా వారంలో 6 రోజులు సేవలు అందిస్తుంది. అలాగే తిరుగు ప్రయాణంలో బెంగళూరు-ముంబై (27652) రైలు బెంగళూరులో రాత్రి 7.45 గంటలకు బయల్దేరి రాత్రి 10.28 గంటలకు అనంతపురంకు, 11.20 గంటలకు గుంతకల్లుకు చేరుకుంటుంది. ఈ సర్వీసు సోమవారం మినహా వారంలో 6 రోజులు నడుస్తుంది.
Also Read
- AP Govt: అసైన్డ్, ఇనాం, పట్టా భూముల రైతులకు ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం..
- Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కాసుల వర్షం.. దసరా ఉత్సవాల హుండీ ఆదాయం రూ.11.59 కోట్లు..
- GVMC Result Day: పోలింగ్ శాతం హఠాత్తుగా పెరగడంపై వైసీపీ అనుమానం.. రేపే ఓట్ల లెక్కింపు
- Arnab Cyclone Effect: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. ఏపీకి రూ.4,600 కోట్ల నష్టం.!
అత్యాధునిక సదుపాయాలు.. టికెట్ ధరల వివరాలు
ఈ వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 ఏసీ కోచ్‌లు ఉండగా, ప్రయాణికుల కోసం మొత్తం 823 సౌకర్యవంతమైన బెర్త్‌లను ఏర్పాటు చేశారు. రాత్రి సమయాల్లో సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారికి ఈ స్లీపర్ కోచ్‌లు ఎంతో సౌకర్యంగా ఉండనున్నాయి. ఇక టికెట్ ధరల విషయానికి వస్తే.. బెంగళూరు నుంచి ముంబైకి రైల్వేశాఖ థర్డ్ ఏసీ (3AC)కి రూ.2,810, సెకండ్ ఏసీ (2AC)కి రూ.3,630, అలాగే ఫస్ట్ ఏసీ (1AC)కి రూ.4,450 చొప్పున ధరలను నిర్ణయించింది. ఏపీకి చెందిన ప్రయాణికులు ఈ సరికొత్త సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Vande Bharat Sleeper : ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్.. 16 గంటల్లోనే ముంబై..
-
Imran Khan: ‘‘ఇకపై నిరసనల్లో పాల్గొన, భారత్‌పై అపారమైన ప్రేమ’’.. ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు.!
-
Chiranjeevi : అమిత్ షాతో చిరు, చరణ్ భేటీ
-
Rice Price Fraud : బియ్యం దందాకు చెక్.. హైదరాబాద్‌లో 11 కేసులు.!
-
Sharad Pawar: ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!