Rains Damage:అకాలవర్షాలు.. అన్నదాతకు కష్టాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మండు వేసవిలో అకాలవర్షాలు అన్నదాతలకు ఇబ్బందులు తప్పడంలేదు. అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతలు నిలువునా మునిగిపోయారు. కామారెడ్డి జిల్లాలో కల్లాల్లో ఆరబోసిన వడ్లన్నీ నీటిలో తడిసి ముద్దయ్యాయి. దీంతో రైతులకు పెద్ద ఎత్తున నష్టం కలగనుంది. తెలంగాణ వ్యాప్తంగా సంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో రైతులు వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఎల్లారెడ్డి మండల సబ్ధల్ పూర్, మల్లయ్య పల్లి కొనుగోలు సెంటర్లలో తడిసిన ధాన్యం కుప్పలతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
Also Read
- CM Chandrababu : చంద్రబాబు ఫుల్ బిజీ.. ఉత్తరాంధ్రలో ఒక్కరోజే 3 జిల్లాలు..
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
తూకం వేసిన వరి ధాన్యం బస్తాలు కూడా వర్షానికి తడిసి పోయాయని, ఇప్పటికైనా కొనుగోలు సెంటర్లలో లేట్ చయకుండా త్వరగా కొనుగోలు చేయాలని రైతులు కోరారు. అంతేకాకుండా వడ్ల బస్తాలను రైస్ మిల్లులకు వెంటవెంటనే తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశంలోకి ప్రవేశించినట్టు వాతావరణ విభాగం తెలిపింది. పక్షం రోజుల వ్యవధిలోనే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. అకాలవర్షం కారణంగా చేతి కొచ్చిన వరి , మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలతో పట్టణవాసులకు కాస్త ఉపశమనం కలిగితే గ్రామీణ ప్రాంతాల్లో పంటలు అతలాకుతలం అయ్యాయి. ఈదురుగాలులతో వరి నేల రాలింది.మామిడి కాయలు రాలాయి. వందలాది ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతిన్నది . ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు పూర్తిస్థాయిలో దెబ్బతిన్న పంట నష్టాన్ని పూర్తిగా అంచనావేసి నష్టపరిహారం అందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు .
తాజావార్తలు
-
Mookuthi Amman 2: అమ్మోరు పాత్రలో మళ్లీ నయనతార… ఫాంటసీ ఎంటర్టైనర్ కి భారీ ఓటీటీ డీల్?
-
Neeraj Chopra: లుసానే డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రాకు రజతం.. 88.05 మీటర్ల సీజన్ బెస్ట్
-
Mega 158 : సంక్రాంతికి రెండు గెటప్పుల్లో మెగాస్టార్ విధ్వంసం: ‘కాకా’ టైటిల్ గ్లింప్స్‌తో పూనకాలు!
-
Employee Fraud : క్రెడిట్ కార్డులతో కోటి మోసం.. మాజీ ఉద్యోగి బాగోతం..
-
Paddy Bonus Rules: సన్న వడ్ల రైతులకు అలర్ట్.. రూ.500 బోనస్ రావాలంటే సెప్టెంబర్ 10లోపు ఈ పని చేయాల్సిందే..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?