Vizianagaram SP: వృద్ధురాలు ఒంటిపై ఉన్న బంగారం కోసమే హత్య..
- విజయనగరం జిల్లాలోని ముగడ కాలనీలో దారుణం..
- ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలు గద్దె కృష్ణవేణి దారుణ హత్య..
- నిందితురాలిని అదుపులోకి తీసుకున్న విజయనగరం పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizianagaram SP: విజయనగరం జిల్లా బాడంగి మండలంలోని ముగడ కాలనీలో దారుణం జరిగింది. ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలు గద్దె కృష్ణవేణిని దొంగలు దారుణంగా చంపేశారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. ఈ ఘటనతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా, వృద్దరాలు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ.. వృద్ధురాలి ఇంటి పక్కన ఉంటున్న కలిశెట్టీ లలిత కుమారి అనే మహిళే హత్యకు పాల్పడిందన్నారు. డబ్బు అవసరం కావడంతో.. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై కన్నేసింది.. వృద్ధురాలి ఒంటిపై ఉన్న బంగారం, డబ్బు కాజేయడానికి ప్లాన్ చేసింది.. పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసి 14.5 తులాల బంగారం దోచుకుని వెళ్లింది అని ఎస్పీ జిందాల్ పేర్కొన్నారు. కాగా, క్లూస్ టీమ్, టెక్నికల్ ఏవిడెన్స్ సహాయంతో కేసును చేదించామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. హత్య చేసిన తర్వాత బంగారం దోచుకుని విశాఖ జిల్లా కంచరపాలెం వెళ్ళిపోయింది.. వెంటనే ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకుని.. దోచుకెళ్లిన సొత్తును రికవరీ చేశామన్నారు. కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని అభినందిస్తున్నామన్నారు.
Read Also: Thangalaan: మొదటి రోజే విక్రమ్ తంగలాన్ ఎన్ని కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?
Also Read
- AP Government: భూ కేటాయింపు విధానంలో కీలక సంస్కరణలు.. ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం
- OTR: సాయి కృష్ణ కస్టోడియల్ డె*త్.. హోమ్ మంత్రి ఎందుకు మౌనం?
- OTR: డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎమ్మెల్యే పార్ధసారధి ప్రయత్నాలు.. ఎందుకు రివర్స్ అవుతున్నాయి?
- Visakhapatnam: రాష్ట్రపతి పర్యటనలో కలకలం.. కాన్వాయ్ వైపు దూసుకొచ్చిన యువకుడు.!
అలాగే, రామ భద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వెహికల్ చెకింగ్ లో భాగంగా గంజాయిని స్వాధీనం చేసుకున్నాం అని విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఒడిస్సా నుంచి విశాఖకు తరలిస్తున్న 20 కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకునీ వాహనదారుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలిస్తున్నామ్.. బొబ్బిలి టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో గంజాయి తరలిస్తున్న ఎనిమిది మందిని పట్టుకున్నామని చెప్పుకొచ్చారు. వారి వద్ద నుండి 16 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నాం.. వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు.. బొబ్బిలిలో గంజాయి కొని బెంగుళూరు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేశారు.. ఒడిస్సా నుండి గంజాయిని తీసుకుని వచ్చి ఇక్కడ అమ్ముతున్నారు.. గంజాయి కొనే వారిని.. అమ్మేవారిని.. వారి వెనుక ఉన్న వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నామని వకుల్ జిందాల్ వెల్లడించారు.
తాజావార్తలు
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Monsoon 2026: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఈ 15 రోజులు అత్యంత కీలకం.. భారీ వర్షాలు!
-
Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!
-
Zombie Reddy 2: తేజ సజ్జ సరసన బాలీవుడ్ బ్యూటీ? టాలీవుడ్ ఎంట్రీకి షనయా కపూర్ రెడీనా!
-
Commercial LPG Cylinder Price Cut: గుడ్ న్యూస్.. ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గాయోచ్..
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!