Commercial LPG Cylinder Price Cut: గుడ్ న్యూస్.. ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గాయోచ్..
- వినియోగదారులకు కేంద్ర చమురు మార్కెటింగ్ సంస్థలు శుభవార్త
- ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ల ధరలు రూ.183.50 మేర తగ్గాయి
- 14.2 కేజీల గృహ వినియోగ LPG సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూలై 1 నుంచి వాణిజ్య ఎల్పీజీ (Commercial LPG) వినియోగదారులకు కేంద్ర చమురు మార్కెటింగ్ సంస్థలు శుభవార్త చెప్పాయి. దేశవ్యాప్తంగా 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ.174 నుంచి రూ.183.50 వరకు తగ్గిస్తూ కొత్త ధరలను అమల్లోకి తెచ్చాయి. ఈ తగ్గింపుతో రెస్టారెంట్లు, హోటళ్లు, భోజనశాలలు, టీ స్టాళ్లు వంటి వాణిజ్య వినియోగదారులకు ఊరట లభించనుంది. అయితే, 14.2 కేజీల గృహ వినియోగ LPG సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో సాధారణ గృహ వినియోగదారులకు ఈసారి ధరల తగ్గింపు లభించలేదు.
ఢిల్లీలో అత్యధిక తగ్గింపు
కొత్త ధరల ప్రకారం ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ LPG సిలిండర్‌పై రూ.183.50 తగ్గింపు అమలు చేశారు. అలాగే లక్నో, పాట్నా నగరాల్లో కూడా ఇదే స్థాయిలో ధరలు తగ్గించగా, కోల్‌కతాలో రూ.174 తగ్గింపు ప్రకటించారు.
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
కొత్త ధరలు ఇవే
ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన తాజా ధరల ప్రకారం, ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ LPG సిలిండర్ ధర రూ.3,113.50 నుంచి రూ.2,930కు తగ్గింది. పాట్నాలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,227గా నిర్ణయించగా, 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధర మాత్రం రూ.1,031.50 వద్ద యథాతథంగా కొనసాగుతోంది.
హోటళ్లు, రెస్టారెంట్లకు ఊరట
కమర్షియల్ LPG ధరలు తగ్గడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సేవలు, ఫుడ్ వ్యాపారాలకు గ్యాస్ ఖర్చు తగ్గే అవకాశం ఉంది. దీని ప్రభావం భవిష్యత్తులో కొన్ని ఆహార పదార్థాల ధరలపై కూడా కనిపించే అవకాశముందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!