నేడు విజయవాడకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బయలుదేరారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుండి గన్నవరం ఎయిర్ పోర్ట్ కి చేరుకోకుని, 10 గంటలకు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం ఉదయం 11:15 కి ఫోటోగ్రాఫర్స్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ లో కేంద్రమంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం12:45 కి కే.ఎల్ యూనివర్సిటీ లో ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని, సాయంత్రం 4:30 కి ఆజాధిక అమృత్ మహోత్సవంలో భాగంగా పింగళి వెంకయ్య స్వగ్రామమైన భట్లపెనుమర్రులో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని, రాత్రి 8 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి పయనం అవుతారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కార్యకమం పేరు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ఇది భారత స్వాతంత్య్ర దినోత్సవం 2022 ఆగస్టు 15 కు 75 వారాల ముందు ప్రారంభమవుతుంది[1]. 2023 స్వాతంత్ర్య దినోత్సవం వరకు కొనసాగుతుంది[2]. జన-భాగీదారి స్ఫూర్తితో దీనిని జనోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో 250 మందికిపైగా రాజకీయ, వ్యాపార ప్రముఖులతో జాతీయ అమలు కమిటీ ఏర్పాటు చేసి, ఈ సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే..
read also: Chinese Rocket: తప్పిన గండం.. హిందూ మహాసముద్రంలో కూలిన చైనా రాకెట్
అయితే.. నిన్న సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీకి రోజులపాటు వెళ్లి.. సీఎం ఎం చేసారో ఎవరికి అర్థం కావట్లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవ చేసారు. గత ఏడాది లాగే ఈ ఏడాది వరదలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. గత ఏడాది లక్ష ఇళ్లలో నీళ్లు వస్తె ప్రభుత్వం 1000 కోట్లు ఖర్చు పెట్టారు. మూసీ రివర్ మీద కార్పొరేషన్ ఎర్పాటు చేసి రుణాలు తీసుకున్నది కానీ, ఒక్క అడుగు కూడ ముందుకు వెళ్ళలేదని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ గ్రాఫిక్ ఏర్పాటు చేసి మభ్య పెట్టారు తప్పా మూసీ అభివృద్ది జరగలేదని విమర్శించారు. కొంత మంది మూసీ నది ఆక్రమించుకొని పేదలకు రెంట్ కు ఇస్తున్నారని ఆరోపించారు. అక్రమ ఆక్రమణలను నిరోధించామని , శాసనసభలో ఉన్నప్పుడు గతంలో కోరామని గుర్తుచేసారు. సబర్మతి నది పరిశీలించి వచ్చి కూడా 5ఏళ్లు అవుతుందని మండిపడ్డారు. మూసీ ప్రాంతమంతా బడుగు బలహీనర్గాలు ఉండే ప్రాంతమని అన్నారు.
Nadendla Manohar: పవన్‌ను ఉద్దేశించి సీఎం జగన్ కామెంట్లు బాధాకరం