కడపలో బీజేపీ రాయలసీమ రణభేరి సభకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఏపీ అప్పుల రాష్ట్రంగా మారిపోయిందని ఆరోపించారు. ఎక్కడ అప్పులు పుడతాయా అనే స్థితిలోకి ఏపీ వెళ్లిపోయిందని.. అప్పులు చేసి రాష్ట్రాన్ని ఎన్నాళ్లు నెట్టుకొస్తారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏపీలో పాలన ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదని వ్యాఖ్యానించారు. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు…