Andhra Pradesh: కేంద్రం శుభవార్త.. పోలవరం ఖర్చు మొత్తం భరిస్తామని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. శుక్రవారం నాడు ఏపీ సీఎం జగన్ తో కలిసి పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను పోలవరం ప్రాజెక్టును సందర్శించానని, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, సవాళ్లను పరిశీలించానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక్కొక్క రాయికి అయ్యే ఖర్చును చెప్పిన ప్రకారమే కేంద్రం భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అని తెలిపారు. పోలవరం ఏపీకి జీవనాడి అని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు, సవాళ్ళను పరిశీలించానని, పనుల పురోగతిలో అడ్డంకులను అధిగమించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సీడబ్ల్యూసీకి ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వివరించారు. తగిన సమయంలో పనులు పూర్తి అయ్యేలా సమావేశాల షెడ్యూల్ కూడా ఖరారు చేశామన్నారు.
ముందుగా దేవీపట్నం మండలం ఇందుకూరు-1 నిర్వాసితుల కాలనీని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పరిశీలించారు. పోలవరం నిర్వాసితుల కోసం ఇక్కడ 350 ఇళ్లను నిర్మించారు. ఇందుకూరులో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం నిర్వాసితులతో కేంద్రమంత్రి మాట్లాడారు. పునరావాస కాలనీ అద్భుతంగా ఉందని.. కాలనీలో ప్రభుత్వం చక్కని వసతులు కల్పించిందని ఆయన తెలిపారు. తాను కొన్ని పునరావాస కుటుంబాలను కూడా కలిశానని, పునరావాస బాధిత కుటుంబాల విషయంలో తీసుకోవలసిన చర్యలపై రాష్ట్ర అధికారులు, పీపీఏ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. అయితే ప్రాజెక్టుకు సవరించిన అంచనాల విషయంలో రాష్ట్రం ఇవ్వాల్సిన వివరాలు ఇవ్వటం లేదని… వివరాలు ఇచ్చిన తర్వాత నిధులను ఆమోదించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. తాను రెండేళ్ల ముందే ఇక్కడకు రావాల్సిందని.. వచ్చి ఉంటే ప్రాజెక్టు పనులు ఇంకా వేగంగా జరిగి ఉండేవన్నారు. కరోనా కారణంగా రాలేకపోయానని.. దేశంలోనే ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామని… అయినా ఇంకా చాలా పని చేయాల్సి ఉందని గజేంద్రసింగ్ షెకావత్ వెల్లడించారు.
Also Read
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!