Anurag Thakur: బీజేవైఎం ముగింపు సభలో పాల్గొనేందుకు బయలుదేరిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విజయవాడకు చేరుకున్నారు. విజయవాడ కనక దుర్గమ్మను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఠాకూర్ మాట్లాడుతూ.. ఏపీలో మంచి ప్రభుత్వం రావాల్సి వుందని సంచళన వ్యాఖ్యలు చేశారు. గతంలో టీడీపీ, ప్రస్తుత వైసీసీ పాలన ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. జవాబుదారీ ప్రభుత్వం, ప్రజారంజకంగా పాలన అందించే ప్రభుత్వం త్వరలోనే ఏపీలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీ సుపరిపాలన, ఏపిలో రానుందని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన బీజేపీ అందిస్తుందని తెలిపారు.
కొద్దిరోజులుగా బీజేవైఎం యువ సంఘర్షణ యాత్ర చేపట్టింది. ఈ ముగింపు సమావేశంలో కేంద్రమంత్రి అనుగార్ ఠాకూర్ పాల్గొంటారు. ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న ఠాకూర్ బైక్ ర్యాలీతో ఎయిర్ పోర్టు నుంచి నగరానికి చేరుకుంటారు. సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ గ్రౌండ్స్ లో జరిగే యువ సంఘర్షణ యాత్ర ముగింపు సభలో అనురాగ్ ఠాకూర్ పాల్గొంటారు. అనంతరం విజయవాడ నుంచి హైదరాబాద్ కు పయనమవుతారు.
Tammineni Krishnaiah Incident : కృష్ణయ్య హత్య కేసులో తమ్మినేని కోటేశ్వరరావు పరారీ