Undavalli Arun Kumar: రెండు తెలుగు రాష్ట్రాల్లో తారక్‌ని బీజేపీ వాడుకుంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Undavalli Arun Kumar On Amit Shah Jr NTR Meeting: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జూ. ఎన్టీఆర్ కలయికపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వారి కలయిక వెనుక రాజకీయమే అయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తారక్‌ని వినియోగించుకునే ఛాన్స్ కూడా ఉందని చెప్పారు. అయితే.. తారక్‌కి అన్ని విషయాలపై అవగాహన ఉందని, ఎప్పుడెలా వ్యవహరించాలో అతనికి తెలుసని అన్నారు. ఇదే సమయంలో శ్రీకాకుళంలో పర్యటనకు బయలుదేరిన నారా లోకేష్‌ను అడ్డుకోవడం మంచి సంప్రదాయం కాదని.. టీడీపీ ప్రభుత్వం ఇలాగే చేసి ఉంటే, జగన్ పాదయాత్ర చేయగలిగేవారా? అంటూ ప్రశ్నించారు. పోలీసులకు ప్రతిపక్ష నాయకుల్ని హౌస్ అరెస్ట్‌లు చేయడంతోనే సరిపోతోందని అన్నారు.
అలాగే.. మార్గదర్శి కేసు ప్రస్తావనని ఉండవల్లి తీసుకొచ్చారు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిందని, సీఎం జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా మార్గదర్శి కేసులో ఎస్‌ఎల్‌పీ వేయాలని కోరారు. సెప్టెంబర్ 19న మార్గదర్శి కేసు వాయిదా ఉందని చెప్పిన ఉండవల్లి.. చట్టవిరుద్ధంగా రామోజీరావు 2,600 కోట్లు సేకరించారని ఆరోపించారు. తాను రామోజీరావుని జైల్లో పెట్టాలని చెప్పడం లేదని, కనీసం కేసు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రామోజీని కలిసేందుకు అమిత్ షా వచ్చారని.. రేపు అమెరికా అధ్యక్షుడు బైడెన్, ప్రధాని మోదీ కూడా రామోజీ వద్దకు రావొచ్చని ఎద్దేవా చేశారు.
Also Read
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- Nellore Politics: గ్రౌండ్ వర్క్ స్టార్ట్.. రాజకీయాల్లోకి ప్రముఖ నాయకుల కూతుళ్లు, కోడళ్లు!
- Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
తాజావార్తలు
-
Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
-
Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
-
KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
-
Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
-
Layoffs: జాబ్స్‌కు రెడ్ అలెర్ట్.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఎందుకు ఊడుతున్నాయ్..? కాగ్నిజెంట్ నివేదికలో ఏముంది?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!