Two Women Killed In Kurnool By Unknown Persons In Kurnool District: కఠినమైన చట్టాలు వస్తున్నాయి కానీ.. నేరస్తులపై తగిన చర్యలే తీసుకోవడం లేదు. దీన్నే అలుసుగా తీసుకొని దుండుగులు రెచ్చిపోతున్నారు. కొన్నాళ్లు జైలు శిక్షకు మించి పెద్దగా నష్టాలేవీ జరగవని భావిస్తూ.. నేరాలకు పాల్పడుతున్నారు. హత్యలు, అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. మరీ ముఖ్యంగా.. మహిళల్నే టార్గెట్ చేసుకొని, కొందరు కిరాతకులు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఒంటరిగా కనిపిస్తే అత్యాచారం చేయడం లేదా ఏదో ఒక విషయంలో పగ పెంచుకొని చంపడం లాంటి ‘నేరాలు-ఘోరాలు’ చేస్తున్నారు. ఇప్పుడు కర్నూలు జిల్లాలోనూ గుర్తు తెలియని వ్యక్తులు.. అలాంటి దారుణానికే పాల్పడ్డారు. ఇద్దరు మహిళల్ని కిరాతకంగా గొంతు కోసి చంపేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Tragedy: దుబాయ్‌లో విషాదం.. భవనంపై నుంచి పడి ఐదేళ్ల భారతీయ చిన్నారి మృతి
కర్నూలు జిల్లాలోని ఓరకల్లు మండలం నన్నూరుకి చెందిన రామేశ్వరి, రేణుక అనే మహిళలు కూలి పనులు చేసుకుంటూ.. తమ జీవనం కొనసాగిస్తున్నారు. ఎప్పట్లాగే బుధవారం కూడా వీళ్లు కూలి పనులకు వెళ్లారు. అయితే.. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ మహిళలపై దాడి చేశారు. వారి చెర నుంచి తప్పించుకుని, పారిపోవడానికి రామేశ్వరి, రేణుక ప్రయత్నించారు కానీ ఫలితం లేకుండా పోయింది. ఆ దుండగులు తమతో తెచ్చుకున్న కత్తితో వారి గొంతు కోసి చంపేశారు. రామేశ్వరి, రేణుక చనిపోయారని నిర్ధారించుకొని.. ఆ దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. వీరి మరణవార్త విని.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసుల్ని కోరుకుంటున్నారు.
Wedding Video Going Viral: స్టేజ్‌పై వధువును బలవంతం చేసిన వరుడు..
మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారనే విషయాన్ని ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. రామేశ్వరి, రేణుకలని మాత్రమే టార్గెట్ చేశారంటే.. కచ్ఛితంగా ఎవరో తెలిసిన వారే ఈ పనికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు.