Road Accident: కోనసీమలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Two Students Died In Konaseema Dist Road Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌లో వెళ్తున్న ముగ్గురు యువకులు కారుని తప్పించబోయి, ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ వివరాల్లోకి వెళ్తే.. అమలాపురంలోని శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్‌లో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులు, ఈరోజు కాలేజీలో ప్రాక్టికల్స్‌కు వెళ్లారు. ప్రాక్టికల్స్ అయ్యాక ముగ్గురు తిరిగి ఇంటికి బైక్‌లో బయలుదేరారు. అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెం వద్దకు చేరుకున్నప్పుడు.. తమ ముందున్న కారుని తప్పించబోయేందుకు ప్రయత్నించారు. అయితే.. ఈ ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న లారీని వీళ్లు గమనించలేకపోయారు. సునాయాసంగా దాటేయొచ్చని అనుకున్నారు.
Boat Accident: ఇటలీ తీరంలో విషాదం.. శరణార్థుల పడవ మునిగి 34 మంది మృతి
Also Read
- Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
- AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
- RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
కానీ.. ఆ యువకులు నేరుగా వెళ్లి లారీని గుద్దేశారు. అతివేగంతో వాళ్లు బైక్ నడపడంతో.. బలంగా లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు స్పాట్‌లోనే మరణించారు. మృతి చెందిన విద్యార్థుల్ని ఎన్. నరేంద్ర, ఎన్. రాజేష్‌గా గుర్తించారు. ఎన్ నరేంద్ర కొత్తపేట మండలం ఖండ్రిగ గ్రామానికి చెందినవాడు కాగా.. ఎన్. రాజేష్ అంబాజీపేట మండలం ముక్కామల గ్రామానికి చెందినవాడు. చిన్న వయసులోనే తమ పిల్లలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో.. నరేంద్ర, రాజేష్ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, బంధువులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మరోవైపు.. గాయపడిన మరొక యువకుడ్ని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..