Ritika Singh On Double Meaning Trolls: ‘మీమ్స్ ట్రెండ్’ మొదలైన కొత్తలో.. నెటిజన్లు సరదాగా నవ్వుకునేలా మీమ్స్ చేసేవారు. కానీ.. కాలక్రమంలో కొందరు తప్పుదారి పట్టారు. నవ్వించడానికి బదులు.. డబుల్ మీనింగ్ మీమ్స్ చేయడం స్టార్ట్ చేశారు. రానురాను అది మరింత హద్దుమీరింది. కథానాయికల ఫోటోలను మార్ఫింగ్ చేసి, న్యూడ్ ఫోటోలను సర్క్యులేట్ చేయడం మొదలుపెట్టారు. ఈ వ్యవహారంపై ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే, కొందరు దుండగులు మాత్రం మార్ఫింగ్ చేయడం ఆపట్లేదు. అంతకంటే ఎక్కువగానే రెచ్చిపోతున్నారు. డబుల్ మీనింగ్ మీమ్స్‌తో పాటు మార్ఫింగ్ ఫోటోలతో సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్నారు. పెద్ద పెద్ద కథానాయికల్ని సైతం విడిచిపెట్టట్లేదు.
Plane Crash: కుప్పకూలిన మెడికల్ ట్రాన్స్‌పోర్ట్ విమానం.. రోగితో పాటు ఐదుగురు మృతి
ఈ విషయంపై ఇప్పటికే ఎందరో హీరోయిన్లు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇలాంటివి ఆపాల్సిందిగా కోరారు. ఇప్పుడు రితికా సింగ్ కూడా తన ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో హీరోయిన్ల ఫోటోలను చాలా అసహ్యంగా ఎడిట్ చేస్తున్నారని, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారని వాపోయింది. తాను కూడా ఇలాంటివి ఫేస్ చేశానని, అలాంటివి చూసినప్పుడు చాలా బాధేస్తుందని పేర్కొంది. అందరిలాగా తనకూ ఫ్యామిలీ ఉందని, అలాంటి చెత్త ఫోటోలు నా పేరెంట్స్ చూస్తే, వారి గుండె బద్దలవుతుందని బావోద్వేగానికి లోనైంది. దయచేసి అలాంటి ఫోటోలు ఎడిట్ చేయొద్దని, డబుల్ మీనింగ్స్‌తో మీమ్స్ సృష్టించొద్దని, ఒకసారి అలాంటివి చేసేముందు ఒకసారి ఆలోచించండని రితికా కోరింది.
Pakistan: పాక్ సైన్యానికి రెండు పూటల ముద్ద కరువు.. ఆర్థిక సంక్షోభం, ఆహార కొరతే కారణం
ఇక సినిమాల విషయానికొస్తే.. గురు సినిమాతో రితికా సింగ్ టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది. తొలి సినిమాతో నటిగా అందరి మనసులు దోచిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత నీవెవరో, శివలింగ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. కాకపోతే ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. అరకొర సినిమాలతోనే తన కెరీర్‌ని లాక్కొస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు మెయిన్ లీడ్‌లో ‘ఇన్‌కార్’ అనే సినిమా చేసింది. మార్చి 3వ తేదీన ఇది పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతోంది.