Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Two Children Died After Eating Jamun Fruit In Kurnool District

Kurnool District: నేరేడు పండ్లు తిని ఇద్దరు చిన్నారులు మృతి.. కారణం ఏంటంటే..?

Published Date :June 15, 2022 , 10:02 am
By Ramesh Nalam
Kurnool District: నేరేడు పండ్లు తిని ఇద్దరు చిన్నారులు మృతి.. కారణం ఏంటంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కర్నూలు జిల్లా కోసిగిలో విషాదం చోటు చేసుకుంది. నేరేడు పండ్లు తిని ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. కోసిగి మూడోవార్డులో నాలుగు రోజుల క్రితం బూగేని మాదేవి అనే మహిళ తన అత్త తెచ్చిన నేరేడు పండ్లను తన ఇద్దరు చిన్నారులు హర్ష, అంజిలకు ఇచ్చింది. వాళ్లతో పాటు ఆడుకుంటున్న మరో బాలుడు శ్రీరాములు కూడా ఆ పండ్లను తీసుకుని తిన్నాడు. కొన్ని పండ్లను చిన్నారుల తల్లి మాదేవి కూడా తిన్నది. అయితే కాసేపటికే నలుగురు చిన్నారులు స్పృహ కోల్పోయారు. వెంటనే వారిని కుటుంబీకులు ఆదోనీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

అయితే నేరేడు పండ్లను తిన్నరోజే హర్ష అనే నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. మంగళవారం నాడు అస్వస్థతకు గురైన చిన్నారుల్లో అంజి అనే నాలుగేళ్ల చిన్నారి కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో నేరేడు పండ్ల తిని మృతి చెందిన వారి సంఖ్య రెండుకు చేరింది. అయితే నరసప్ప అనే రైతు పొలం నుంచి మాదేవి అత్త నరసమ్మ ఈ నేరేడు పండ్లను తీసుకొచ్చింది. ఈ పండ్లను తిన్న తర్వాతే చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. క్రిమిసంహారక మందులకు సంబంధించిన కవర్‌లో నేరేడుపండ్లు తీసుకురాగా.. ఆ పండ్లను కడగకుండా అలాగే తినడంతోనే ఇలా అస్వస్థతకు గురైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బాధితుల శరీరంలోకి పాయిజన్ వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. అందువల్ల ఎవరైనా పండ్లను తినేటప్పుడు నీటితో శుభ్రంగా కడుక్కుని తినాలని సూచిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • jamun fruit
  • kosgi
  • kurnool district
  • two children

తాజావార్తలు

  • Pakistan Demands Nobel Peace Prize: షాబాజ్ షరీఫ్, మునీర్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి.. పాకిస్తానీల వింత డిమాండ్‌..

  • Onion Rice Recipe: అమ్మల కష్టానికి ఫుల్ స్టాప్.. ఉదయాన్నే హడావిడి లేకుండా 10నిమిషాల్లో టేస్టీ, హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ..

  • 3 States Elections: 3 రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఓటింగ్.. ఎంత పోలింగ్ నమోదైందంటే..!

  • AK64 : అజిత్ కుమార్ డబుల్ రోల్: అటు రేసింగ్.. ఇటు షూటింగ్!

  • Supreme Court: మహాభారతం పోరాటంలాగా ఉంది.. విడాకులిస్తూ సుప్రీంకోర్టు అసహనం

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions