ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటనపై సీరియస్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.తులసిరెడ్డి. దావోస్ పర్యటన ఓ గండికోట రహస్యమంటూ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి మేలు చేయాలంటే వెళ్లాల్సింది దావోస్ కి కాదని, ఢిల్లీకి అని ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తే దావోసే ఏపీకి పరిగెత్తుకు వస్తుందన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు, దుగ్గరాజపట్నం ఓడరేవు, విశాఖ కారిడార్, విశాఖ ఉక్కును కాపాడటం…