Site icon NTV Telugu

TTD Assets: ఆ ప్రముఖ కంపెనీల కన్నా.. తిరుమల శ్రీవారి ఆస్తులే ఎక్కువ..!!

Tirumala

Tirumala

తిరుమల శ్రీవారి ఆస్తులపై శనివారం నాడు టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారికి రూ.2.5 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నట్లు టీటీడీ వెల్లడించింది. అయితే దేశంలోని ప్రముఖ కంపెనీల ఆస్తుల కంటే తిరుమల శ్రీవారి ఆస్తులే ఎక్కువ అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలతో పోలిస్తే తిరుమలకు ఉండే ప్రత్యేకత వేరు. తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని ప్రతియేటా లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. భక్తులు ఎన్నో విలువైన కానుకలను శ్రీవారికి సమర్పించుకుంటారు. తిరుమలలో ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులకు ఉచితంగా అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. దీంతో అన్నదాన ట్రస్టుకు కూడా భక్తులు భారీగా విరాళాలను సమర్పిస్తారు. ఆంధ్రప్రదేశ్​‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీల్లోని పలు ఆలయాలను టీటీడీ నిర్వహిస్తుంది. ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తుంది.

Read Also: Minister KTR : ఫేకుడు… జోకుడు తప్ప ఎన్నికల్లో బీజేపీ దగ్గర ఏమి లేదు

కాగా 1933 నుంచి గమనిస్తే తొలిసారిగా టీటీడీ ఇటీవల తిరుమల శ్రీవారి ఆస్తులను ప్రకటించింది. శ్రీవారి ఆస్తుల్లో 10.25 టన్నుల బంగారం, 2.5 టన్నుల ఆభరణాలు, రూ. 16వేల కోట్ల నగదు ఉన్నాయి. ఇవన్నీ బ్యాంకు డిపాజిట్లుగా ఉన్నాయి. అంతేకాకుండా టీటీడీకి దేశవ్యాప్తంగా 960 ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి. ఈ మొత్తం విలువ రూ. 2.5లక్షల కోట్లుగా ఉంటుందని టీటీడీ అంచనా వేసింది. శ్రీవారి సంపదను స్టాక్​ మార్కెట్​లోని సంస్థలతో పోల్చి చూస్తే ఎన్నో ప్రముఖ​ కంపెనీల నెట్​ వర్త్​ కన్నా శ్రీవారి ఆస్తులే అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది.

ప్రస్తుతం బెంగళూరు ఆధారిత ఐటీ దిగ్గజ సంస్థ విప్రో మార్కెట్​ క్యాపిటల్​ రూ. 2.14లక్షల కోట్లుగా ఉంది. అల్ట్రాటెక్​ సిమెంట్స్​ మార్కెట్​ క్యాపిటల్​ విలువ రూ. 1.99లక్షల కోట్లు. అంతర్జాతీయ ఫుడ్​ అండ్​ డ్రింక్​ సంస్థ నెస్లేకి చెందిన ఇండియా విభాగం మార్కెట్​ క్యాపిటల్​ రూ. 1.96లక్షల కోట్లుగా ఉంది. వీటితో పాటు ఓఎన్​జీసీ, ఐఓసీ, ఎన్​టీపీసీ, మహీంద్రా అండ్​ మమీంద్రా, టాటా మోటార్స్​, కోల్​ ఇండియా, వేదాంత, డీఎల్ఎఫ్‌తో పాటు ఎన్నో సంస్థల మార్కెట్​ క్యాపిటల్​ శ్రీవారి ఆస్తుల కన్నా తక్కువగానే ఉన్నాయి. అయితే బీఎస్​ఈలో 6వేలకు పైగా కంపెనీలు లిస్ట్ కాగా వీటిలో సుమారు 30 సంస్థల మార్కెట్​ క్యాపిటల్​ మాత్రమే శ్రీవారి అస్తుల కన్నా ఎక్కువగా ఉంది. రిలయన్స్ సంస్థ క్యాపిటల్ రూ. 17.53లక్షల కోట్లుగా, టీసీఎస్​ సంస్థ క్యాపిటల్ రూ. 11.76లక్షల కోట్లుగా, హెచ్‌డీఎఫ్‌​సీ బ్యాంక్​ క్యాపిటల్ రూ. 8.34లక్షల కోట్లుగా, ఇన్ఫోసిస్​ క్యాపిటల్ రూ. 6.37లక్షల కోట్లుగా, ఐసీఐసీ బ్యాంక్​ క్యాపిటల్ రూ. 6.31లక్షల కోట్లుగా ఉంది. వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.

Exit mobile version