TTD: హాట్ కేకుల్లా శ్రీవారి దర్శన టికెట్లు.. గంటన్నరలో ఏప్రిల్ కోటా మొత్తం బుకింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: కొలిచినవారి కొంగు బంగారం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు క్యూ కడతారు.. సీజన్‌తో సంబంధం లేకుండా తిరుమల గిరులు నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతూనే ఉంటాయి.. ఇక, ఏదైనా ప్రత్యేక సందర్భం వచ్చిందంటే.. సెలవులు వచ్చాయంటే భక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.. అయితే, ఆన్‌లైన్‌లోనూ శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.. ఈ రోజు ఉదయం 11 గంటలకు రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఏప్రిల్ మాసానికి సంబంధించిన 3.26 లక్షల టికెట్లను అమ్మకానికి ఆన్‌లైన్‌లో పెట్టారు టీటీడీ అధికారులు.. అయితే, కేవలం గంటన్నర వ్యవధిలోనే ఏప్రిల్ కోటా మొత్తం టికెట్లను బుక్‌చేసుకున్నారు భక్తులు. కాగా, వేసవి సెలవుల నేపథ్యంలో ఏప్రిల్ నెల కోటా టికెట్లకు భారీ ఎత్తున డిమాండ్ ఉండే అవకాశం ఉందని ముందే అంచనా వేశారు అధికారులు.. దానికి తగ్గట్టుగానే కేవలం గంటన్నర వ్యవధిలో 3.26 లక్షల టికెట్లను బుక్ చేసుకున్నారు భక్తులు. అయితే, గతంలో 45 నిమిషాల లోపు కూడా మొత్తం కోటా టికెట్లు బుక్ చేసుకున్న సందర్భాలు లేకపోలేదు.
Read Also: RK Roja: ఆ నలుగురు ఎమ్మెల్యేలకు రోజా సవాల్.. దమ్మంటే రాజీనామా చేయండి..!
Also Read
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!