అన్నమయ్యని అగౌరపరుస్తున్నారని టీటీడీ పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు టీటీడీ అదనపు ఇఓ ధర్మారెడ్డి. శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ,కళ్యాణోత్సవం,ఏకాంత సేవ కార్యక్రమంలో అన్నమయ్య వంశీకులు పాల్గొంటారు. మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా నాలుగు మాడ వీధులలో మఠాలుతో పాటు స్థానికుల నివాసాలను తొలగించాం….వారికి ప్రత్యామ్నాయ ప్రదేశాలలో పునరావాసం కల్పించాం అన్నారు ధర్మారెడ్డి.
అన్నమయ్య వంశీకులుకు శ్రీవారి ఆలయంలో సంప్రదాయబద్దంగా వస్తూన్న గౌరవ మర్యాదలు కల్పిస్తున్నాం అన్నారు. 45 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అన్నమయ్య ప్రాజేక్ట్ కు ప్రతి ఏటా 25 కోట్లు కేటాయిస్తున్నాం. 14 వేల 900 అన్నమయ్య కీర్తనలు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. 25 మంది పండితులతో అన్నమయ్య కీర్తనల పై పరిశోధన నిర్వహిస్తున్నాం. 4400 కీర్తనలను ఇప్పటి వరకు స్వర పర్చగా….మరో వెయ్యి కీర్తనలు స్వరపర్చే కార్యక్రమం ప్రారంభించామన్నారు.
అన్నమయ్య జయంతి,వర్ధంతి కార్యక్రమాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. తాళ్లపాకలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసాం. ప్రభుత్వం నూతన జిల్లా పేరును అన్నమయ్య జిల్లాగా నామకరణం చేసిన సంగతిని ఆయన గుర్తుచేశారు.