పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు పని చేయాలి..
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు (ఫిబ్రవరి 15న) ఉదయం డిప్యూటీ సీఎం, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదుకు రూ.2 కోట్లు విరాళం అందించి, తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు. పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని, పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారిని “ఉద్యమి”గా, పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి, నవతరంలో ప్రేరణ కలిగించి పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులను చేసి సభ్యత్వ నమోదు చేసేవారిని “సాధక్”గా, జనసేన పార్టీ చేస్తున్న ప్రజా, రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని, ఆర్థిక, సాంకేతిక, సేవా, మేథా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారిని “ప్రదాత”గా ఇక నుంచి పిలుస్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
6 నెలలకే ముగిసిన పెళ్లి.. క్యాన్సర్ ఉన్నప్పుడే ఆ నటుడు నన్ను మోసం చేశాడు..
సినిమా రంగంలో ఎంతటి విజయాలు అందుకున్నా, నిజ జీవితంలో మాత్రం అనేక అగ్నిపరీక్షలను ఎదుర్కొన్నారు మమతా మోహన్ దాస్. ‘యమదొంగ’ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈమె, కేవలం నటిగానే కాకుండా క్యాన్సర్ సర్వైవర్‌గా కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. 2009లో మొదటిసారి క్యాన్సర్ బారిన పడ్డా ఆమె. దాన్ని జయించి మళ్ళీ సినిమాల్లోకి వచ్చినా, 2013లో అది మళ్ళీ తిరగబెట్టింది. అదే సమయంలో ఆమెకు బొల్లి వ్యాధి కూడా సోకింది. అయితే తాజాగా ఆమె తన ప్రేమ, పెళ్లి ఒక ప్రముఖ నటుడు తనను ఎలా మోసం చేశాడో వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
20 ఏళ్ల నా రాజకీయ ప్రయాణంలో లంబాడాల పాత్ర అమూల్యం..
2006లో ఇండిపెండెంట్ జడ్పీ ఛైర్మన్‌గా నిలబడ్డప్పుడు వైఎస్ హవాలోనూ లంబాడా యువకులు తనను జడ్పీటీసీగా గెలిపించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నాలుగు నెలల్లో 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకోబోతున్నట్లు తెలిపారు.. నేడు సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. 20 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో లంబాడా యువకులు అండగా నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు.. ఇప్పటికీ కరెంట్ లేని తండాలు ఉన్నాయని.. మానవ జాతి శాంతి మార్గంలో నడవాలి.. శాంతి, భక్తితో సామర్గంతో అభివృద్ధి పదంలో నడవాలని సంత్ సేవలాల్ మహారాజ్ స్ఫుర్తి నింపారని చెప్పారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు, పునర్నిమాణంలో లంబాడాల పాత్ర ఎవరు తీసిపోలేనిది.. తుడిచి పెట్టలేనిదన్నారు. దళితులతో పాటు గిరిజనులకు మేలు జరగాల్సి ఉందని.. సముచిత స్థానం.. గౌరవం ఇవ్వాలన్నారు. అన్ని తండాలకు బీటీ రోడ్లు ఉన్నాయి. ప్రణాళిక బద్దంగా ప్రతీ తండాలో పాఠశాల ఉండాలి.. భవనం కోసం ఏర్పాట్లు చేయాని సూచించారు. గ్రామ పంచాయతీ లకు భవనం ఉండాలి.. గూడెం అయినా తండా అయినా గ్రామ పంచాయతీ భవనాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఆవేశంలో తప్పుచేశా.. నా కెరీర్ అయిపోయిందనుకున్నా: అక్షయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తన కెరీర్లో ఎదుర్కొన్న ఒక భయంకరమైన సంఘటనను గుర్తు చేసుకున్నారు. తాజాగా ఓ షోలో ముచ్చటిస్తూ, ఆవేశంలో తాను చేసిన ఒక అతిపెద్ద తప్పు గురించి సంచలన విషయాలు పంచుకున్నారు. కొన్ని ఏళ్ల క్రితం ఒక పార్టీలో తన సన్నిహిత మిత్రుడిని ఒక వ్యక్తి అసభ్య పదజాలంతో దూషించాడని, పదే పదే హెచ్చరించినా వినకుండా తన స్నేహితుడిని ఏడిపించడంతో ఆవేశం ఆపుకోలేక ఆ వ్యక్తిని గట్టిగా కొట్టినట్లు అక్షయ్ తెలిపారు. ఆ దెబ్బకు ఆ వ్యక్తి అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోవడంతో తన గుండె ఆగినంత పనైందని అక్షయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కోలీవుడ్ హీరోలకు అందని ద్రాక్షగా వెయ్యికోట్ల గ్రాస్ కలెక్షన్స్
కోలీవుడ్ స్టార్లకు థౌజండ్ క్రోర్ కలెక్షన్స్ అందని ద్రాక్షగా మారింది. పక్క ఇండస్ట్రీలతో పోటీ పడి ఎక్స్ పరిమెంట్స్ చేస్తున్నప్పటికీ.. రిజల్ట్ మరోలా ఉంది. గత ఏడాది పక్కా అనుకున్నారు.. కానీ సీన్ రివర్స్ అయ్యింది. లాస్ట్ ఇయర్ ఆగస్టులో రిలీజైన కూలీతో థౌజండ్ క్రోర్ టచ్ చేయడం పక్కా అని ఎస్టిమేషన్ వేసుకుంది కోలీవుడ్. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్, మల్టీస్టారర్స్ నటించడంతో పిచ్చ హైప్ వచ్చింది. కానీ బొమ్మ నెగిటివ్ టాక్‌తో అనుకున్నంతగా రీచ్ కాలేదు. దీనికి తోడు స్టార్ హీరోస్ కమల్, సూర్య, అజిత్ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర అండర్ ఫెర్ఫామెన్స్ చేయడం కూడా వెయ్యి కోట్ల మార్క్ అందుకోలేకపోయింది. అలాగే దళపతి విజయ్ సినిమా లేకపోవడం కూడా మైనస్‌గా మారింది.
మాజీ సీఎం కుమారుడికి సీరియస్..
మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే చిన్న కుమారుడు తేజస్ ఠాక్రే ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో ఆయనను వారి కుటుంబ సభ్యులు రిలయన్స్ ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక పరీక్షల తర్వాత ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని, మెరుగుపడుతుందని వైద్య వర్గాలు వెల్లడించాయి. అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత తేజస్ కోలుకుంటున్నట్లు సమాచారం. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే – రష్మి ఠాక్రేలు ఆసుపత్రిలో తేజస్ తో పాటు ఉన్నారు. గత మూడు రోజులుగా తేజస్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందనే దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం తెలియలేదు. ఆయన తండ్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ ఉదయం ఆసుపత్రికి వెళ్లి తేజస్ ఆరోగ్యం గురించి ఆరా తీశారని పలు నివేదికలు వెల్లడించాయి.
“పార్లమెంట్లో నమాజు చేస్తా.. కానీ వందేమాతరం పాడను”.. ఎంపీ ఇమ్రాన్ సంచలన ప్రకటన..
“నేను పార్లమెంట్లో నమాజు చేస్తాను కానీ వందేమాతరం మాత్ర పాడను” ఇది ఒక కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్ ఆవరణలో ఇచ్చిన స్టేట్మెంట్. భారత స్వాతంత్య్రోద్యమంలో వందేమాతరం ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిందే. తాజాగా అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గేయం వందేమాతరం ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశించడాన్ని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘వందే మాతరం’ గీతం పాడే సమయంలో తప్పనిసరిగా అందరూ నిలబడాలన్న అంశంపై ఇమ్రాన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “వందే మాతరం ఇప్పటికే పాడుతున్నాం. కానీ అన్ని ఆరు చరణాలు చదవాలని చెబితే నేను చదవలేను. ఎందుకంటే నా మతం దానికి అనుమతించదు. నాకు ఇక్కడ(పార్లమెంట్) ఆవరణలో సజ్దా(ఇస్లామిక్ ప్రార్థన) చేయడంలో ఎలాంటి సమస్య లేదు. కానీ నా మతం ఏమి చెబుతుందో అది పాటించే స్వేచ్ఛను నాకు భారత రాజ్యాంగం ఇచ్చింది” ఎంపీ అని అన్నారు. ఇమ్రాన్ మసూద్ ప్రధానంగా రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను ప్రస్తావించారు. దేశానికి గౌరవం ఇవ్వడంలో తాను వెనుకాడనని, కానీ తన మత పరిమితులను దాటలేనని స్పష్టం చేశారు. ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా మాత్రమే కాకుండా, సమాజంలో కూడా పెద్ద చర్చగా మారే అవకాశం కనిపిస్తోంది.
ప్రాణం తీసిన ఎలక్ట్రిక్ బెడ్.. విద్యుదాఘాతంతో 45 ఏళ్ల వ్యాపారవేత్త మృతి
కేశవ్‌పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని త్రి నగర్లో ఒక షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. ఎలక్ట్రిక్ బెడ్ పై నిద్రిస్తున్న 45 ఏళ్ల వ్యక్తి విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు మద్యానికి బానిసయ్యాడని, ఉదయం నుంచి మద్యం సేవిస్తున్నాడని, మంచంలోనే విద్యుత్ షాక్ తగిలి మరణించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. బెడ్ కు అనుసంధానించిన విద్యుత్ తీగ, విద్యుత్ సాకెట్ కూడా గుర్తించారు. ప్రమాదం తరువాత, క్రైమ్ సీన్ బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. విద్యుత్ మంచం నుండి విద్యుత్ షాక్ కారణంగా మరణించిన మొదటి కేసు ఇదే కావచ్చని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం వాయువ్య ఢిల్లీ జిల్లాలోని త్రి నగర్లో జరిగింది. ఈ ప్రమాదం గురించి కేశవ్‌పురం పోలీస్ స్టేషన్‌కు PCR కాల్ వచ్చింది. విద్యుత్ షాక్ కారణంగా తన సోదరుడు మరణించాడని కాల్ చేసిన వ్యక్తి తెలిపాడు. ధీరజ్ కౌశిక్ అనే వ్యక్తి గదిలోని ఎలక్ట్రిక్ బెడ్‌పై చనిపోయి కనిపించాడని పోలీసు అధికారులు తెలిపారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆరు మున్సిపల్ పీఠాలపై ఉత్కంఠ
ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 18 మున్సిపాలిటీలు ఉండగా, ప్రధానంగా ఆరు కీలక పట్టణాల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ‘హంగ్’ పరిస్థితి నెలకొంది. మున్సిపల్ చైర్మన్ సీట్లను ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలు ముమ్మరంగా వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. అభ్యర్థులను కాపాడుకునేందుకు , ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఇప్పటికే రహస్య ప్రాంతాల్లో క్యాంపు రాజకీయాలు కూడా మొదలయ్యాయి. ఇంద్రేశం వంటి చోట్ల స్వతంత్రులు బీఆర్ఎస్లో చేరడంతో కొన్ని పీఠాలు ఖరారైనప్పటికీ, మిగిలిన చోట్ల మాత్రం రేపు జరగబోయే ఎన్నిక వరకు ఉత్కంఠ కొనసాగేలా ఉంది.
దుబాయ్‌లో పాకిస్తానీ బిచ్చగాళ్ల దుకాణం క్లోజ్.. బిచ్చగాడి నుండి లక్షల రూపాయలు స్వాధీనం
రంజాన్ పండుగకు ముందు, దుబాయ్‌లో పోలీసులు యాచకులపై భారీ చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా విదేశాల నుండి వచ్చే వారిని వారు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్యాంపెయిన్ లో లక్షల విలువైన ఆస్తి, మూడు లగ్జరీ కార్ల యజమానిగా మారిన ఒక యాచకుడిని పట్టుకున్నారు. నేర సంఘటనల విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ అలీ సలేం అల్ షంసి ప్రకారం, కొంతమంది డబ్బు సంపాదించడానికి ప్రజల దాతృత్వాన్ని దోపిడీ చేస్తారు. మార్కెట్లో జరిగిన దాడిలో, ఒక బిచ్చగాడి చాప కింద నుండి 25,000 దిర్హామ్‌లు (సుమారు 600,000 రూపాయలు) స్వాధీనం చేసుకున్నారు. అదనంగా, టూరిస్ట్ వీసాపై వచ్చిన ఒక ఆసియా వ్యక్తి నుండి రూ.500,000 స్వాధీనం చేసుకున్నారు. అతను మసీదుల దగ్గర భిక్షాటన చేసి, సానుభూతి పొందడానికి తన రెండేళ్ల బిడ్డను తన వెంటే పెట్టుకున్నాడు.