దీపికా పదుకొణే పొగరు వల్ల ఓ ఇద్దరి బాలీవుడ్ బ్యూటీస్ కి కలిసొచ్చింది
యానిమల్‌తో రష్మిక నుండి నేషనల్ క్రష్ ట్యాగ్ తీసుకున్న త్రిప్తి దిమ్రీకి అక్కడి నుండి లక్ దడేల్ దడేల్ అని తన్నుకొస్తుంది. హిందీలో స్టార్ హీరోలతో జోడీ కట్టే ఛాన్స్ దక్కించుకోవడమే కాదు టాలీవుడ్ ఎంట్రీకి సిద్దమైంది. దీపికా పదుకొణే అత్యుత్సాహం, యారోగన్సీ వల్ల త్రిప్తి లాభం పొందింది. ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా హై అక్డేన్ మూవీలో తానూ ఊహించకుండానే ఛాన్స్ కొల్లగొట్టింది. లేకుంటే ఇప్పట్లో ఆమె టాలీవుడ్ తెరంగేట్రం కష్టమే. యానిమల్‌తో జోయాగా పరిచయం అయినప్పటి అదీ బీటౌన్ ఫిల్మ్. సో ఇప్పుడు స్పిరిట్‌తో త్రిప్తి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది.
కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో 50 లక్షలు గెలుచుకున్న రైతు
కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో పాల్గొని రూ. 50లక్షలు గెలుచుకున్నాడు మహారాష్ట్రకు చెందిన రైతు. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని పైథాన్ పట్టణానికి చెందిన చిన్న రైతు కైలాష్ కుంతేవర్, ప్రముఖ టెలివిజన్ షోలో 14 ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పడంతో.. అతడు షోకు ఎలిజిబుల్ అయ్యాడు. అనంతరం రూ.50 లక్షలు గెలుచుకున్నాడు. వరదల వల్ల పంటలు కోల్పోయిన మహారాష్ట్రకు చెందిన ఒక రైతు అమితాబ్ బచ్చన్ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి షోకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కుంతేవర్ కు కేవలం రెండు ఎకరాల భూమి ఉంది. అతని తల్లిదండ్రులు, భార్య పిల్లలతో నివసిస్తున్నారు. సంవత్సరాలుగా, అతను ఎదురుదెబ్బలు, కరువు, వరదలు మరియు పంట వైఫల్యాన్ని ఎదుర్కొన్నాడు, తరచుగా ఇతరుల పొలాల్లో కూలీగా పనిచేయవలసి వచ్చింది. కానీ తను పడిన తపన, కష్టం అతడిని కేబీసీ షోకు చేరుకునేలా చేసింది.
నాలుగో వారం టెనెంట్ నుండి షాకింగ్ ఎలిమినేట్..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 7న గ్రాండ్ లాంచ్‌తో ప్రారంభమైన ఈ షోలో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ముగ్గురు ఇప్పటికే ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లగా, ఇప్పుడు నాలుగో వారం కూడా ఒకరు ఎలిమినేట్ కావడంతో హౌజ్‌లో కంటెస్టెంట్స్ సంఖ్య తగ్గింది. మొదటి వారం శ్రేష్టి వర్మ, రెండో వారం మనీష్ మర్యాద, మూడో వారం ప్రియా శెట్టి షో నుంచి బయలుదేరారు. ప్రియా ఎలిమినేషన్‌కు ముందు ‘రాయల్ కార్డ్’ ఎంట్రీగా దివ్య నిఖితా హౌజ్‌లోకి రావడంతో, ఇప్పటివరకు మొత్తం 13 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లో కొనసాగుతున్నారు.
మేక మేత విషయంలో వివాదం … మహిళ హత్య.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో మేక మేత విషయంలో జరిగిన వివాదం కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఓ మహిళను పక్కింటి వారు కొట్టి చంపారు. మృతురాలి కుమార్తె పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంగా ఉండడంతోనే తన తల్లి చనిపోయిందంటూ ఆరోపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే….నార్వాల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న 55 ఏళ్ల రాణి దేవికి ఇద్దరు కుమార్తెలు, ఐదుగురు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 2వ తేదీ రాత్రి, మేకలను మేపడం గురించి ఆమె తన పొరుగువాడైన సత్యంతో వాగ్వాదం జరిగింది. వివాదం కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఆమె తీవ్ర స్థాయిలో గాయాలు కావడంతో.. ఆమె కుమార్తె మౌసామి ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. కానీ పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించి.. ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రం అభివృద్ధి.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం అభివృద్ధిపై దేవావయా, అటవీశాఖలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నతాధికారులు హాజరయ్యారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగిన దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఆలయ సమగ్రాభివృద్ధిపై చర్చ జరిగింది. ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై చర్చించారు. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆధ్యాత్మికంగా, పర్యాటక ప్రాంతంగా, పర్యావరణ పరంగా శ్రీశైలం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. దేవాలయ అభివృద్ధి కోసం 2 వేల హెక్టార్ల భూమిని దేవాదాయశాఖకు కేటాయించేలా కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. శ్రీశైల క్షేత్రానికి జాతీయ రహదారులను అనుసంధానించేలా ప్రణాళికలు చేయాలని సీఎం ఆదేశించారు. శ్రీశైలంలోని పులుల అభయారణ్యం అభివృద్ధికి సూచనలు చేశారు. భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతున్న కారణంగా… ఆలయ సమగ్రాభివృద్ధికి సత్వర చర్యలు అవసరమని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న సందర్భంగా సౌకర్యాలు విస్తరించాలని సూచించారు. శబరిమల సహా ఇతర దేవాలయాల్లో సౌకర్యాలను పరిశీలించి శ్రీశైలాన్ని అభివృద్ధి చేద్దామన్నారు.
బీహార్ ఎన్నికల తేదీపై సీఈసీ కీలక ప్రకటన
బీహార్ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 22 లోపు ముందే ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు రెండు రోజుల పర్యటన కోసం ఈసీ బృందం శనివారం పాట్నాకు వచ్చింది. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నేతల అభిప్రాయాలను సేకరించారు. తక్కువ సమయంలో ఎన్నికల ప్రక్రియను ముగించాలని అన్ని పార్టీల నేతలు ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించాయి.
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో సవాల్.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్..
తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లులు పాస్ అయ్యాక, ఉత్తర్వులు సైతం జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ హైకోర్టు స్థానిక ఎన్నికలపై ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్‌రెడ్డి సెప్టెంబరు 29న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్‌పై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఫోన్‌లో సంభాషించారు. సుప్రీంకోర్టు విచారణపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని డిప్యూటీ సీఎంను ఆదేశించారు. దీంతో ఈరోజు రాత్రి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీకి బయలు దేరనున్నారు. రేపు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసు నేపథ్యంలో ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. ప్రభుత్వం, పార్టీ పరంగా తీసుకోవాల్సిన అంశాలపై భట్టి విక్రమార్కతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింగ్వి.. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదించనున్నారు.
అమెరికా అధ్యక్షుడికి ఫెడరల్ కోర్టులో మరో ఎదురు దెబ్బ.. పాపం ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఫెడరల్ కోర్టులో మరో ఎదురు దెబ్బతగిలింది. ఒరెగాన్లోని పోర్ట్‌ల్యాండ్‌కు 200 మంది నేషనల్ గార్డ్ దళాలను మోహరించాలనే ట్రంప్ నిర్ణయాన్ని శనివారం ఫెడరల్ కోర్టు అడ్డుకట్ట వేసింది. ఈ నిర్ణయాన్ని అక్టోబర్ 18 వరకు ముందుకు కదపడానికి వీలు లేదని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక అయిన తర్వాత నియమితులైన అమెరికా జిల్లా న్యాయమూర్తి కరిన్ ఇమ్మెర్గట్ ఈ ఉత్తర్వును జారీ చేశారు. పోర్ట్‌ల్యాండ్‌లో నిరసనలు “తిరుగుబాటు” స్థాయికి పెరిగాయని లేదా శాంతిభద్రతలకు ఈ నిరసనలు తీవ్రంగా ఆటంకం కలిగించాయనే ఆధారాలను కోర్టుకు సమర్పించలేదని ఆమె తన తీర్పులో పేర్కొన్నారు.
ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెట్టినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడి రాజకీయం మొదలైంది. మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వం, కేంద్రంపై విరుచుకుపడ్డారు. హరీష్ రావు మాట్లాడుతూ.. “ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెట్టినా, తిరిగి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ప్రజలు మళ్లీ కేటీఆర్, కేఎస్ఆర్ నేతృత్వంలోనే తెలంగాణను ముందుకు నడిపిస్తారు” అని ధీమా వ్యక్తం చేశారు. “బీజేపీ దేశం కోసం కాదు, కేవలం నార్త్ ఇండియన్ ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తోంది. తెలంగాణ కూడా భారతదేశంలో భాగమే కదా? మరి మన రాష్ట్రానికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు?” అని ప్రశ్నించారు.
కోతులను వెళ్లగొట్టినోళ్లకే ఓట్లు వేస్తారంట..!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోతుల బెడద సమస్యగా మారింది. చాలా గ్రామాల్లో కోతుల సంఖ్య విపరీతంగా పెరగడంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ చూసినా కోతుల సంచారం కనిపిస్తుండగా, కొందరిపై దాడులు జరగడం కూడా భయాందోళనకు గురిచేస్తోంది. పరిస్థితి ఏ స్థాయిలో ఉందంటే.. గ్రామాల్లో మనుషుల కంటే కోతులే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది. దీంతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. స్థానికులు పలుమార్లు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే సమయంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో, రాజకీయ నేతలు ప్రచార యాత్రల్లో బిజీగా మారారు. అభ్యర్థుల ప్రకటనల ముందే ఆశావాహులు ఇంటింటికీ తిరుగుతూ మద్దతు కోరుతున్నారు.
