Tomato Market price: తెలుగు రాష్ట్రాల్లో అమాంతం పడిపోయిన టమాటా ధరలు
- కిలో రూ.100 నుంచి రూ.10కి పడిపోయిన టమాటా ధర
- మదనపల్లి, అనంతపురం మార్కెట్లలో రైతుల ఆవేదన
- క్రేట్‌కు రూ.150 కూడా రాక నష్టాల్లో సాగుదారులు
- మద్దతు ధర, కోల్డ్ స్టోరేజ్ కల్పించాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tomato market price today : గత కొన్ని వారాల క్రితం ఆకాశాన్ని తాకిన టమాటా ధరలు ఇప్పుడు అమాంతం నేలకు దిగివచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్కెట్లలో టమాటా ధరలు భారీగా పడిపోవడంతో సామాన్య ప్రజలకు ఊరట లభించినప్పటికీ, పండించిన రైతులకు మాత్రం కన్నీళ్లే మిగులుతున్నాయి. పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఏపీ , తెలంగాణలోని మదనపల్లి, అనంతపురం, వికారాబాద్ వంటి ప్రధాన మార్కెట్లలో టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గతంలో కేజీ 80 నుండి 100 రూపాయల వరకు పలికిన ధర, ఇప్పుడు కేవలం 5 నుండి 10 రూపాయలకు చేరుకుంది. మార్కెట్లకు భారీగా టమాటా నిల్వలు పోటెత్తడం, దిగుబడి పెరగడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు.
Also Read
- CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
- Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
- AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
టమాటాను సాగు చేయడానికి పెట్టిన పెట్టుబడి, కోత కోయడానికి అయ్యే కూలీ ఖర్చులు, , మార్కెట్‌కు తరలించడానికి అయ్యే రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఒక క్రేట్ (సుమారు 25-30 కేజీలు) టమాటా ధర కేవలం 100 నుండి 150 రూపాయలకే పలుకుతుండటంతో, గిట్టుబాటు ధర లేక రైతులు హతాశులవుతున్నారు. తమ కష్టార్జితానికి తగిన విలువ దక్కకపోవడంతో కొందరు రైతులు ఆగ్రహంతో టమాటాలను రోడ్లపైనే పారబోస్తున్నారు. మార్కెట్‌కు తీసుకెళ్లినా కనీసం రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో, వాటిని అక్కడే వదిలేసి వెళ్తున్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి మద్దతు ధర కల్పించాలని లేదా కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. టమాటా ధరలు తగ్గడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల మార్కెట్లో తక్కువ ధరకు టమాటా లభిస్తుండటంతో కొనుగోళ్లు పెరిగాయి. అయితే, వినియోగదారులకు లాభం చేకూరినప్పటికీ, పండించిన రైతు మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడని వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
-
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. చంద్రబాబు కీలక ఆదేశాలు
-
AP Govt: 18 ఏళ్లు నిండిన వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త.. రూ.2 లక్షల చొప్పున సాయం..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!