Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 23 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఈ నెల 3న అల్లవరం మండలం ఓడలరేవు నుంచి సముద్రంలో వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయిన ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని దిఘా తీరానికి చేరుకున్న అనంతరం.. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ముందుగా కాకినాడకు, ఆపై ఓడలరేవుకు అధికారులు తీసుకొచ్చారు.
మత్స్యకారులు గ్రామానికి చేరుకున్న వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందభాష్పాలతో వారిని ఆప్యాయంగా హత్తుకుని స్వాగతం పలికారు. 23 రోజుల పాటు తమవారి ఆచూకీ తెలియక తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబాల్లో ఇప్పుడు ఆనందం వెల్లివిరిసింది. ఇన్నాళ్ల నిరీక్షణకు తెరపడటంతో వారి ముఖాల్లో సంతోషం కనిపించింది. మత్స్యకారులు స్వగ్రామానికి వస్తున్నారన్న సమాచారంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రామ ప్రవేశం సందర్భంగా వారికి పూలమాలలు వేసి, హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. తమవారు క్షేమంగా తిరిగి రావడంతో ఓడలరేవు గ్రామమంలో పండుగ వాతావరణం నెలకొంది. సముద్రంలో ఆచూకీ లేకుండా పోయిన తమ గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Road Accident: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా.. అక్కడికక్కడే ఒకరి మృతి..
- Rahul Gandhi: ‘‘ర్యాలీకి రండి.. షాపింగ్ కూడా చేయండి’’.. రాహుల్ గాంధీ పిలుపు..
- State Election Commissioner: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి: ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
- AP Municipal Elections 2026: ఏపీలో 8.39 శాతం ఓటింగ్.. నగరిలో అత్యధిక పోలింగ్!
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
Road Accident: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా.. అక్కడికక్కడే ఒకరి మృతి..
-
Rahul Gandhi: ‘‘ర్యాలీకి రండి.. షాపింగ్ కూడా చేయండి’’.. రాహుల్ గాంధీ పిలుపు..
-
State Election Commissioner: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి: ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
-
AP Municipal Elections 2026: ఏపీలో 8.39 శాతం ఓటింగ్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
CJP: మద్దతు ఇస్తాం, కానీ పాల్గొనబోం.. ప్రతిపక్షాల ర్యాలీపై అభిజిత్ దీప్కే..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!