RBI: ప్రస్తుతం నిత్యవసరాల ధరలు నింగిని తాకుతున్నాయి. మొన్నటి వరకు టమాటా ధరలు చుక్కలు చూపించాయి. పప్పుధాన్యాల ధరలు కూడా రాకెట్ లా దూసుకుపోతున్నాయి. దీంతో సామాన్యులపై భారం పడుతోంది. కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరగడంతో ఏమి కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతొ దేశంలో ద్రవోల్బణం కూడా విపరీతంగా పెరుగుతోంది. ఇది ఆర్థికాభివృద్దికి అంతమంచిది కాదు. ఈ నేపథ్యంలో సామాన్యులకు ఊరట కలిగే ఒక విషయాన్ని వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. సెప్టెంబర్ నుంచి…