Tirumala: తిరుమల భక్తులకు శుభవార్త.. నేడు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala: తిరుమల భక్తులకు టీటీడీ శుభవార్తను అందించింది. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తామని టీటీడీ వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ఆగస్టు 7 నుంచి 10 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మూడు రోజుల పాటు రూ.300 దర్శన టికెట్ల కోటాను గతంలో టీటీడీ నిలుపుదల చేసింది. అయితే ఆ టిక్కెట్లను ఈరోజు ఆన్లైన్లో విడుదల చేయనుంది. టీటీడీ వెబ్సైట్ ద్వారా తిరుమలకు వెళ్లాలని భావిస్తున్న భక్తులు ఆ టికెట్లను పొందవచ్చు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు కలిగిన భక్తులకు దర్శనం టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఆగస్టు 7 నుంచి ఆగస్టు 10 వరకు సంబంధించిన దర్శనం టిక్కెట్లు ఈరోజు భక్తులకు అందుబాటులో ఉంటాయి.
Read Also: Bhakthi TV LIVE: తొలి శ్రావణ మంగళవారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే?
Also Read
కాగా గరుడ పంచమి సందర్భంగా తిరుమలలో మంగళవారం నాడు గరుడ వాహనంపై నాలుగు మాడ వీధుల్లో భక్తులకు శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. ఇవాళ ఈవో ధర్మారెడ్డి ఆధ్వర్యంలో బాలాజీనగర్‌లో టీటీడీ శ్రమదానం కార్యక్రమం నిర్వహిస్తోంది. అటు ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమలలో ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు జరుగుతాయి. ఆలయ పవిత్రతను, పరిశుభ్రతను అవధారణ చేసేందుకు ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఒకరకంగా ఇది శుద్ధీకరణ కార్యక్రమంగా చెప్పవచ్చు. ఏడాది పాటు శ్రీవారికి నిత్య పూజలు, ఉత్సవాలు, కైంకర్యాలు జరుగుతుంటాయి కాబట్టి మంత్రదోష, క్రియాదోష, కర్తవ్య దోషాలను తొలగించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల ముందు రోజు అంకురార్పణ జరుగుతుంది. ఏకాదశినాడు పవిత్ర ప్రతిష్ఠ, ద్వాదశి నాడు పవిత్ర సమర్పణ, త్రయోదశి నాడు పూర్ణాహుతి ఉత్సవం జరుగుతుంది. మలయప్ప స్వామికి, ఉభయ దేవేరులకు పవిత్ర మాలల సమర్పణ, ఊరేగింపు కార్యక్రమంతో దోష పరిహారం పూర్తవుతుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?