ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1,435 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,00,038 కి చేరింది. ఇందులో 19,70,864 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 15,472 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 6 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 13,702 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 24 గంటల్లో 69,173 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. ఇప్పటి వరకు మొత్తం 2,59,72,539 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు ఆరోగ్య శాఖ తెలియజేసింది.