TJR Sudhakar Babu: పవన్ నాలుకని వెయ్యిసార్లు కోస్తాం.. ఎమ్మెల్యే టీజేఆర్ ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TJR Sudhakar Babu Fires On Pawan Kalyan Over Volunteer Issue: వాలంటరీ వ్యవస్థపై కామెంట్ చేసిన పవన్ కళ్యాణ్ నాలుకను వెయ్యిసార్లు కోస్తామని వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో ఆయన మాట్లాడుతూ.. వాలంటరీ వ్యవస్థకు సంబంధించి పవన్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పవన్ తైతక్కలాడితే.. ఆ సినిమాలు చూసి హిట్ చేసిన ఆయన అభిమానులకు కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారానే పథకాలు అందచేస్తున్నామన్న విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు.
Delivery Service Fraud: వీడు మామూలోడు కాదు.. డెలివరీ సర్వీస్ పేరుతో ఘరానా మోసం
Also Read
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
వాలంటరీ వ్యవస్థ, సచివాలయాలను వద్దంటున్న పవన్.. తిరిగి జన్మభూమి కమిటీలను తీసుకురావాలని కోరుకుంటున్నారా? అని సుధాకర్ బాబు ప్రశ్నించారు. గత ప్రభుత్వ హాయంలో జరిగిన దోపిడీలపై పవన్ కూడా నిలదీసి ధర్నాలు చేసిన విషయం నిజం కాదా..? అని నిలదీశారు. గతంలో ఒక్క హామీని కూడా నెరవేర్చని చంద్రబాబు ఆడించిన విధంగా పవన్ ఎందుకు ఆడుతున్నారో సమాధానం చెప్పాలని అడిగారు. చంద్రబాబును సీఎం చేయాలని పవన్ ఎందుకు తపిస్తున్నారో స్పష్టం చేయాలని అన్నారు. వాలంటీర్లపై హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు చేసిన పవన్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. 18 వేల మంది ఆడపిల్లలు మిస్ అయ్యారని స్టేట్మెంట్ ఇచ్చిన పవన్ వారి వివరాలు చెప్పాలని.. లేకపోతే వాలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు.
Bengaluru Meeting: నేడు బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం…. హాజరు కానున్న సోనియాగాంధీ
బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలను కూడా వెనక్కు తీసుకోవాలని సుధాకర్ బాబు చెప్పారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే బదులు.. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, విశాఖ రైల్వే జోన్, రామాయపట్నం పోర్టు కావాల్సిన నిధులను కేంద్రం నుంచి తీసుకొని రావడానికి కృషి చేయాలన్నారు. దొంగలకు చంద్రబాబు, దోపిడీకి టీడీపీ కేరాఫ్ అడ్రస్ అని ఆరోపించారు. డేటా దొంగిలిస్తున్నామని ఆరోపణలు చేసే ముందు.. ఎవరి డేటా చోరీ చేశామో సమాధానం చెప్పాలన్నారు. ఫదకాల అమలు కోసం తప్ప ప్రజల నుంచి వివరాలు తీసుకునే అవసరం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..