NTV Telugu Site icon

RK Roja Open Challenge: ప్రభుత్వానికి రోజా సవాల్‌.. నేను చేసిన అవినీతి ఏంటి..?

Roja

Roja

RK Roja Open Challenge: తిరుపతి నియోజకవర్గం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇన్నాళ్లు జగన్ మోహన్ రెడ్డి ను చూస్తే భయపడ్డారు, ఈరోజు జగన్ మోహన్ రెడ్డి కటౌట్ చూసినా కూడా కూటమి నాయకులకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.. ఓట్లు కోసం కాళ్ళు, చేతులు పట్టుకున్నారు… ఇప్పుడు వదిలేశారన్న ఆమె.. ఈవీఎంలు మేనేజ్‌ చేయడం వల్లే.. ఈ ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు.. అధికారంలో ఉన్న కూటమీ ప్రభుత్వంపై నెల రోజులకే వ్యతిరేకత మొదలైంది‌‌‌.. జగన్ అన్న నాయకత్వంలో జగన్ అన్నకు తోడుగా, అండగా ప్రజలు పక్షాన పోరాటం చేద్దాం అని పిలుపునిచ్చారు.. రాబోయే ఎన్నికల్లో భూమన అభినయ్ రెడ్డిని తిరుగులేని మెజారిటీతో గెలిపించాలని సూచించారు.. కూటమి నాయకులకు ఒకటే చెబుతున్నా, మా పార్టీ నాయకుల ఆస్తులు కూలదోచినా, వేధించినా, వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.. ఇక, వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఆర్.కే.రోజా, సిపాయి సుబ్రమణ్యం, మేయర్ డాక్టర్ శిరీష..

Read Also: Effect On Male Fertility: మగాళ్లు జాగ్రత్త.. ఇలా చేస్తే మీ సంతానోత్పత్తిపై తీవ్ర సమస్యలు తలెత్తుతాయి

ఇక, కూటమి ప్రభుత్వానికి బహిరంగ సవాల్‌ విసిరారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. నేను అవినీతి చేసుంటే నిరూపించండి అని ఛాలెంజ్ చేసిన ఆమె.. ఫైల్స్ అన్ని మీ దగ్గరే ఉన్నాయి.. నా తప్పు ఎంటో నిరూపించండి అన్నారు.. జగన్ పుట్టిన రోజుల ఒక పండుగ రోజులా జరుపుకుంటున్నాం‌.. జగన్ లాంటి నాయకుడు దేశంలో రాష్ట్రంలోను లేడని పేర్కొన్నారు.. కులం, మతం లేకుండా అభివృద్ధి చేసిన ఘనత వైఎస్‌ జగన్‌దే అని ప్రశంసలు కురిపించారు.. అబద్దాపు హామీలు ఇచ్చి కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.. మళ్లీ ఏపీ ప్రజలు ఎప్పుడప్పుడు జగన్ సీఎం అవుతారా? అని ఎదురుచూస్తున్నారు.. బాబు షూరిటీ అని చెప్పి ఇప్పుడు బాదుడే బాదుడు గ్యారంటీ అంటున్నాడు అని ఎద్దేవా చేశారు.. కరెంట్ చార్జీలు, నిత్యావసర ధరలు పెంచారు‌‌.. తిరుపతిలో పబ్ లు పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.. వైఎస్‌ జగన్ కటౌట్ చూస్తూ కూడా కూటమీ నేతలు భయపడుతున్నారు.. అధికారులను అడ్డం పెట్టుకుని పుట్టిన రోజు వేడుకలను అడ్డుకుంటున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు మాజీ మంత్రి ఆర్కే రోజా..

Show comments