Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Chandrababu Strong Remarks In Tirupati Never Forget Those Who Did Wrong Swarna Andhra Swachha Andhra Programme

CM Chandrababu: చెడు చేసిన వ్యక్తిని ఎప్పుడూ మరచిపోకూడదు.. గతంలో కనీసం మాట్లాడాలన్నా మాట్లాడలేని పరిస్థితి..!

Published Date :January 24, 2026 , 2:20 pm
By Sudhakar Ravula
CM Chandrababu: చెడు చేసిన వ్యక్తిని ఎప్పుడూ మరచిపోకూడదు.. గతంలో కనీసం మాట్లాడాలన్నా మాట్లాడలేని పరిస్థితి..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: నగరి పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. 2024కు ముందు రాష్ట్రం పూర్తిగా అతలాకుతలం అయిందన్న ఆయన.. నోటీసులు కూడా ఇవ్వకుండా తనను రాత్రికి రాత్రే అరెస్టు చేశారని, గత ఐదేళ్లుగా కనీసం మాట్లాడాలన్నా, నవ్వాలన్నా వీలుకాని పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. అంత భయంకరమైన పాలన ఐదేళ్లపాటు కొనసాగిందని ఆయన విమర్శించారు.

Read Also: Nihilist Penguin: ఈ పెంగ్విన్ స్టోరీ మీమ్ కాదు.. మైండ్ షేక్ చేసే కథ.. అది చివరికి చనిపోయిందా?

చిత్తూరు జిల్లా నగరిలో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ, “చెడు చేసిన వ్యక్తిని ఎప్పుడూ మరచిపోకూడదు. గత ఐదేళ్ల పాలన ఒక రాక్షస పరిపాలనలా సాగింది. నేరస్థులు రాజకీయాలు చేస్తే రాష్ట్రం ఎలా నాశనమవుతుందో ప్రజలు చూశారు” అని వ్యాఖ్యానించారు. మూడు పార్టీలు కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం చేశామని, అదే కూటమి విజయం సాధించడానికి కారణమైందని తెలిపారు సీఎం చంద్రబాబు… తాను చాలాసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని, కానీ ఇంత వేగంగా, ఇంత విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడూ చేయలేదని చంద్రబాబు చెప్పారు.

నగరి టీడీపీకి కంచుకోట
నగరి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.. ఇదే సమయంలో దివంగత నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ప్రజల కోసం చివరి శ్వాస వరకు పనిచేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గాలి భాను ప్రకాష్‌ కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నారని, ముద్దుకృష్ణమ నాయుడు కంటే ఇంకా మెరుగ్గా ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఇక, సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం అసాధ్యమని కొందరు అన్నారని, కానీ కూటమి ప్రభుత్వం వాటిని సూపర్ హిట్‌గా అమలు చేసి చూపించిందని చంద్రబాబు స్పష్టం చేశారు. పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి అన్ని సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు.

ఐదేళ్లలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ
పరిసరాలు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుందని పేర్కొన్నారు చంద్రబాబు.. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు, వ్యర్థాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. అనంతరం ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. సర్క్యులర్ ఎకానమీ భాగంగా నాన్-రీసైక్లబుల్ ప్లాస్టిక్‌ను కూడా సంపదగా మార్చే ప్రక్రియపై అధికారులు ఇచ్చిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మెప్మా, డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించి అభినందించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • alliance government Andhra Pradesh
  • Andhra Pradesh cleanliness drive
  • AP development programmes
  • AP politics news
  • Chandrababu arrest remarks

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions