Bhumana Karunakar Reddy: తప్పుడు ప్రచారంపై భూమన ఫైర్‌.. ఇందుకేనా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు జీతాలు..?

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy: తిరుపతిలో టీడీపీ సోషల్ మీడియాపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి ఆర్‌కే రోజా శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమయంలో తలనీలాలు సమర్పించినట్లుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని జరగని విషయాన్ని జరిగినట్లుగా చూపిస్తూ దుర్మార్గంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కేబినెట్‌లో నిర్ణయం తీసుకుందని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేసేందుకు జీతగాళ్లను తయారు చేస్తున్నారని భూమన ఆరోపించారు. ప్రభుత్వ సొమ్మును ఐటీడీపీ ద్వారా టీడీపీ కార్యకర్తలకు ఉపయోగిస్తూ.. తీవ్రమైన వ్యాఖ్యలు, అసభ్య పదజాలం, వ్యక్తిత్వ హననానికి సోషల్ మీడియాను వాడుతున్నారని విమర్శించారు. తాము చేయని అభివృద్ధికి గొప్పలు చెప్పుకునేందుకు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని భూమన మండిపడ్డారు. శ్రీవారిని దర్శించుకునే ఎవరైనా, ఎంతటివారైనా తలనీలాలు సమర్పించే సంప్రదాయం ఉందన్నారు. రోజా తలనీలాలు సమర్పించకపోయినా చేసినట్లుగా ప్రచారం చేస్తూ కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఇలాంటి దుర్మార్గపు చేష్టలను చూసి ప్రజలు అసహ్యించుకుంటారని.. వాటివల్ల ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఉండదన్నాదు . ఇలాంటి పనులు చేసిన వారి సంగతి భగవంతుడే చూస్తారన్నారు భూమన కరుణాకర్‌రెడ్డి .