విద్యుత్ టవర్ నిర్మాణ పనుల వద్ద విద్యుత్ షాక్ కి గురై ఇద్దరు హిందీ కార్మికులు మృతి చెందారు. చిత్తూరు జిల్లా వరదయ్య పాలెం మండలం రాచర్ల వద్ద నూతనం గా నిర్మిస్తున్న 220కేవీ సబ్ స్టేషన్ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. శుక్రవారం యానాదివెట్టు చెరువుసమీపంలో సబ్ స్టేషన్ కు చెందిన టవర్ నిర్మాణ పనులు చేస్తుండగా టవర్ కి సమీపం లో వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ లైన్ తగిలి జార్ఖండ్ కు చెందిన గహనమారండీ(32),భువనేశ్వర్ మహటో(37) అనే ఇద్ధరు హిందీ కార్మికులు విద్యుత్ షాక్ కు గురయ్యారు.
ప్రమాదానికి గురైన వారిని చికిత్స నిమిత్తం సత్యవేడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఈలోపు వారు మృతి చెందారు. సమాఛారం అందుకున్న ఎస్ఐ పురుషోత్తం రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.