Warning to Singer Sravana Bhargavi: శ్రావణ భార్గవికి వార్నింగ్.. ఇక్కడ అడుగుపెట్టనివ్వం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ అన్నమయ్య ఎన్నో సంకీర్తనలు రాశారు.. పాడారు.. అయితే, ఆ కీర్తనలను శృంగారభరితంగా చిత్రీకరించి వివాదాల్లో చిక్కుకున్నారు ప్రముఖ సినీ గాయని శ్రావణ భార్గవి.. అన్నమయ్య తనయుడు రచించిన ఒకపరి ఒకపరి వయ్యారమై అనే పాటను రీ క్రీట్ చేసిన ఆమె.. తన ఆఫీషియల్ యూట్యూబ్ పేజ్‌లో పోస్ట్ చేశారు.. ఆ వీడియోలు శ్రావణ భార్గవి కనిపించిన విదానమే వివాదానికి కారణం అయ్యింది.. ఇప్పుడు శ్రావణ భార్గవికి వార్నింగ్ ఇచ్చారు తిరుపతి వాసులు.. తిరుపతిలో పుట్టడం అదృష్టంగా భావిస్తారు… అన్నమయ్య సంకీర్తనలను స్వామివారిపై పాడుకుంటూ ప్రపంచం మొత్తం భక్తి భావంతో ఉంటోంది.. కానీ, ఒకపరి ఒకపరి వయ్యారమై సంకీర్తనను శ్రావణ భార్గవి తనకోసం చిత్రీకరించిన తీరు అభ్యంతరం అంటున్నారు.. శ్రావణ భార్గవిని తిరుపతిలో అడుపెట్టనివ్వమని హెచ్చరిస్తున్నారు.
Read Also: Srisailam Dam Live : శ్రీశైలం గేట్లు ఎత్తివేత…| Ntv
Also Read
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
ఒక సెలబ్రిటీని అనే గర్వంతో శ్రావణ భార్గవి.. అన్నమయ్య కుటుంబంతో మాట్లాడారు అని మండిపడుతున్నారు తిరుపతి వాసులు.. ఆమెను తిరుపతిలో అడుగుపెట్టనివ్వం.. తిరుమల దర్శనానికి ఆమెను పంపకుండా అడ్డుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు.. ఇక, వెంటనే శ్రావణ భార్గవి అన్నమయ్య కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.. తక్షణమే ఆ పాటను యూట్యూబ్ నుంచి తొలగించాలని సూచించారు.. మరోవైపు, టీటీడీ ఎందుకు ఈ వ్యవహారంపై స్పందించడంలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.. శ్రావణ భార్గవి పాటపై టీటీడీ అధికారులు స్పందించాలి.. అన్నమయ్య కీర్తనలు ఇకపై ఎవరు తప్పుగా చిత్రీకరించకుండా ఒక చట్టాన్ని టీటీడీ తీసుకురావాలి అంటున్నారు తిరుపతి వాసులు.
కాగా, తన వీడియోపై అభ్యంతరాలు వ్యక్తం అవడం, విమర్శలు రావడంపై స్పందించిన శ్రావణ భార్గవి.. తాను పాడిన పాటలో ఎలాంటి తప్పులేదు.. మీరు చూసే చూపులోనే తప్పుందని ఘాటుగా బదులిచ్చారు.. ఆ వీడియోలో అశ్లీలత ఎక్కడ కనిపించింది? నేను ఆ పాటను ఎంత భక్తితో పాడానో నాకు తెలుసు.. ఈ పాటలో మీకు తెలుగుదనం తప్పా ఇంకేదైనా కనిపిస్తే అది మీ చూపులో లోపం.. నా ప్రాబ్లం కాదు.. మీరు చూసే చూపులో లోపం ఉంటే దుప్పటి కప్పుకుని కూర్చున్నా అశ్లీలంగా కనిపిస్తుంది అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.. ఇక, నేనేం లిరిక్స్ మార్చలేదు.. నా అంతరాత్మకి తెలుసు నేను తప్పుచేయలేదని.. నిజంగా ఈ పాట తప్పు అంటే.. దేవుడే ఆ పాటని తీయించేస్తాడు అని ఆమె కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే.. అయితే, రోజుకో మలుపు తిరుగుతోన్న ఈ వ్యవహారం.. ఇంకా ఎటువైపు దారితీస్తుందో చూడాలి మరి.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!