Atrocities Girls: ఆ బాలికకు 14 ఏళ్లు.. బాగా చదివించాలని కుటుంబ సభ్యుల బాలికను గురుకుల పాఠశాలలో చేర్పించారు. కన్న కూతురు బాగా చదువుకుని అభివృద్ది చెందుతుందని ఆశ పడ్డారు. కానీ ఇంతలోనే ఓఘటన ఆతల్లిదండ్రులకు కంటతడి పెట్టించింది. 14ఏళ్ల మైనర్ బాలిక తల్లైందని చెప్పడంతో.. షాక్ కు గురయ్యారు. గురుకుల పాఠశాలలో ప్రశ్నించగా అది మా సమస్య కాదంటూ చేతులు దులుపుకున్నారు. వైద్యం చేయించేందుకు తీసుకువెళ్లగా మైనర్ బాలికకు తీవ్రంగా కడుపునొప్పి రావడంతో.. వైద్యులు ఆమెను చికిత్స చేశారు. దీంతో ఆబాలిక బిడ్డను కనింది. ఆమె వయస్సు చూస్తే 14ఏండ్లు.. అభం శుభం తెలియని ఆబాలిక చేతిలో మరో పసిబాలుడు ఇదెక్కడి న్యాయం అంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఇంటి అఘాయిత్యానికి పాల్పడిన వారిపై కఠిచర్యలు తీసుకోవాలని కోరారు. గురుకుల పాఠశాల యాజమాన్యం మాత్రం మాకు ఏమీ తెలియదంటూ చేతులు దులుపుకోవడంపై పలు అనుమానాలకు దారితీస్తోంది. ఈఘటన ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వార్త జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది.
Read also: BIG Breking: చెన్నై ద్రౌపది దేవి ఉత్సవాల్లో అపశృతి.. భక్తులపై క్రేన్ పడటంతో ముగ్గుమృతి
అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాలలో చదువుతున్న మైనర్ బాలిక స్వస్థలం తిరుపతి జిల్లా వరదయ్యపాలెం. తల్లిదండ్రులు జీవనోపాధి కోసం తిరుపతికి వచ్చి శ్రీసిటీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ వరదయ్యపాలెంలో నివాసం ఉంటున్నారు. మైనర్ బాలిక సోమలలో తన తాతయ్యల వద్ద ఉంటూ గురుకుల పాఠశాలలో చదువుతున్నట్లు డీసీఓ తెలిపారు. బాలికను ఆరో తరగతిలో హాస్టల్‌లో చేర్చారు. 9వ తరగతి చదువుతుండగా తల్లి అయింది.హాస్టల్‌లో కడుపునొప్పితో బాధపడుతోందని బాలిక చెప్పడంతో వాల్మీకిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మైనర్ బాలిక గర్భవతి అని వైద్యులు గుర్తించారు. అక్కడ ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఐసీడీసీ అధికారులు చిన్నారిని స్వాధీనం చేసుకుని విద్యార్థిని తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ఇంత జరుగుతున్నా హాస్టల్ సిబ్బంది, అధికారులు, తల్లిదండ్రులకు తెలియకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఈఘటనపై జిల్లా కలెక్టర్.. హాస్టల్ సిబ్బంది, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం.. మృతదేహాలు ఎందుకు కనిపించలేదు?
జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాలలో మైనర్ బాలిక పుట్టడంపై డీసీఓ వెంకటరావు వివరణ ఇచ్చారు. వేసవి సెలవుల్లో బాలిక ఇంటికి వెళ్లినప్పుడు జరిగిన తప్పిదమే ఇందుకు కారణమని వాదించారు. బాలికకు పీరియడ్స్ రాకపోవడాన్ని గమనించిన అధికారులు.. తల్లిదండ్రులకు చెప్పినా వైద్యులను ఆశ్రయించి వైద్యం చేయించుకోకపోవడంతో అధికారులు ఇంత వరకూ రావడంతో ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని, తల్లిదండ్రులకు సమాచారం అందించామని డీసీఓ తెలిపారు. కాగా.. బాలికకు మెరుగైన వైద్యం అందించేందుకు తిరుపతి ఆసుపత్రికి తరలించారు. దీంతో.. మైనర్‌ను గర్భవతిని చేసింది ఎవరూ అనే విషయంపై ఆరా తీస్తున్నారు అధికారులు.
Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం.. మృతదేహాలు ఎందుకు కనిపించలేదు?