Tirumala: కలియుగ వైకుంఠ దైవం శ్రీ తిరుమల శ్రీనివాసుడి దర్శనం కోసం భక్తుల క్యూ కట్టారు. ఇప్పటికే శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఐదు రోజుల్లో శ్రీవారి వైకుంఠ ద్వార 3.74 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అలాగే, ఇవాళ సాయంత్రం తిరుమల శ్రీనివాసుడి ఆలయంలో వార్షిక ప్రణయ కలహ మహోత్సవం జరగనుంది.
Read Also: Dhurandhar-Raja Saab : ధురంధర్ దూకుడుకు.. ప్రభాస్ ‘రాజా సాబ్’ బ్రేక్ వేయగలదా ?
మరోవైపు, శ్రీవారి ఆలయంలో ఇవాళ ఆరో రోజు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. టోకెన్లు లేకుండా వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులను అనుమతించడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఇక, నిన్న శ్రీవారిని 88,662 మంది భక్తులు దర్శించుకోగా.. 24, 417 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 5.05 కోట్ల రూపాయలు వచ్చాయి.