Tirumala Rush Down: ఏడుకొండలకు తగ్గిన రద్దీ.. కారణం అదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియుగ వైకుంఠం తిరుమలకు గత కొద్దికాలంగా భారీగా భక్తులు తరలివచ్చారు. గంటల తరబడి వేచి వుండి మరీ స్వామివారిని దర్శించుకున్నారు. ఒక్కోసారి తిరుమలకు రావద్దంటూ టీటీడీ భక్తులను వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎట్టకేలకు తిరుమలలో భక్తుల తాకిడి తగ్గుముఖం పట్టింది. గత ఆరు నెలలుగా కొనసాగుతున్న భక్తులు రద్దీ ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకుంది. దీంతో రోజుల తరబడి శ్రీవారి దర్శనం కోసం వేచిచూసే పరిస్థితి నుంచి గంటల సమయంలోనే ఇప్పుడు స్వామివారి దర్శనభాగ్యం భక్తులకు లభిస్తోంది.
అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవారి దర్శనార్దం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూంటారు. 70 సంవత్సరాల క్రితం రోజుకి 600 మంది భక్తులు మాత్రమే తరలివచ్చే తిరుమలకు ప్రస్తుతం లక్ష మంది భక్తులు తరలివస్తున్నారు. కోవిడ్ కి పూర్వం 2019 లో శ్రీవారిని 2.8 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ తెలిపింది. అటు తరువాత కోవిడ్ కారణంగా శ్రీవారి ఆలయంలో 80 రోజుల పాటు స్వామివారి దర్శనభాగ్యం నిలిపివేశారు.
Also Read
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
అటు తరువాత కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతించడంతో….ఆ ఏడాది శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 80 లక్షలకు పరిమితం అయ్యారు. అటు తరువాత ఏడాదికి కూడా కోటి నాలుగు లక్షల మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకున్నారు. ఇలా కోవిడ్ కారణంగా 30 శాతానికి పడిపోయిన శ్రీవారి భక్తుల సంఖ్య…ఈ ఏడాది మార్చి నుంచి సాధారణ స్థితికి చేరుకుంది. శ్రీవారి ఆలయంలో వున్న పరిస్థితులు దృష్యా ప్రతి నిత్యం 80 నుంచి 90 వేల మంది భక్తులును మాత్రమే దర్శనానికి అనుమతించే అవకాశం వుండడంతో….గత మార్చి నుంచి ప్రతి నిత్యం కూడా అంతే సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
Read Also: The Kashmir Files : భారతదేశ మూలాల కథలతో ‘కాశ్మీర్ ఫైల్స్’ బృందం
దీంతో ప్రతి నిత్యం కూడా క్యూలైనులు కిటికిటలాడాయి. వారాంతం వచ్చిందంటే చాలు క్యూలైనులు కిలోమిటర్లు మేర ఏర్పడ్డాయి. దీంతో సర్వదర్శనం కోసం 40 గంటల సమయం కూడా పట్టింది.ఇలా ఆరు నెలలుగా భక్తజనంతో కిటకిటలాడిన తిరుమలలో ఇప్పుడు భక్తులు రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. ఆరు నెలలు తరువాత మొదటిసారి క్యూ లైనులు బయటకి రాకూండా భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం లభిస్తోంది. కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు దర్శనాలు లేకపోవడంతో….సాధారణ పరిస్థితి రావడంతో గత ఆరు నెలలుగా శ్రీవారిని పెద్ద సంఖ్యలో దర్శించుకోని మొక్కులు చెల్లించుకున్న భక్తులు తాకిడి తగ్గింది. తిరుమలలో సందడి తగ్గి సాధారణ స్థితికి చేరుకుంది. సెప్టెంబర్ 18 నుంచి తమిళులకు ముఖ్యమైన పెరటాసి మాసం వుండడంతో అప్పటి నుంచి తిరిగి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం వుందని భావిస్తున్నారు టీటీడీ అధికారులు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..